ప్రాజెక్టులపై థర్డ్ పార్టీ విచారణకు నలుగురితో కమిటీ

By narsimha lodeFirst Published Jun 9, 2019, 1:38 PM IST
Highlights

సాగునీటి ప్రాజెక్టులపై అక్రమాలపై థర్డ్ పార్టీ విచారణకు ఏపీ సర్కార్ నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ మేరకు సోమవారంనాడు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది


అమరావతి:  సాగునీటి ప్రాజెక్టులపై అక్రమాలపై థర్డ్ పార్టీ విచారణకు ఏపీ సర్కార్ నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ మేరకు సోమవారంనాడు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. టెండర్లు ఖరారైన ప్రాజెక్టులపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 6వ తేదీన సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో థర్డ్ పార్టీ విచారణ చేయాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు ప్రోఫెసర్ రమణ, మాజీ ఈఎన్‌సీ రోశయ్య, నారాయణరెడ్డి, నాక్ డైరెక్టర్ పీటర్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ మూడు మాసాల్లో  ప్రాజెక్టులపై విచారణ జరిపించి  ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. సుమారు 25 ప్రాజెక్టుల్లో సుమారు 55 వేల కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్టుగా ప్రాథమిక అంచనా  ఈ కమిటీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు సోమవారం నాడు వెలువడే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

టెండర్లు పూర్తైన ప్రాజెక్టులపై థర్డ్ పార్టీతో విచారణ: జగన్ కీలక నిర్ణయం

click me!