పవన్ పై ఆకుల షాకింగ్ కామెంట్స్

Published : Jun 21, 2019, 12:28 PM IST
పవన్ పై ఆకుల షాకింగ్ కామెంట్స్

సారాంశం

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ నేత ఆకుల సత్యానారయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఐదేళ్లలో రాజకీయాల్లో ఉంటారో లేదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ నేత ఆకుల సత్యానారయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఐదేళ్లలో రాజకీయాల్లో ఉంటారో లేదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు. కనీసం పార్టీ అధినేత పవన్ కూడా గెలుపొందలేదు. దీంతో.. చాలా మంది నేతలు అధికార పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ క్రమంలో జనసేన పార్టీ నేత ఆకుల సత్యనారాయణ  చేసిన కామెంట్స్ షాకింగ్ కి గురి చేశాయి. కులసమీకరణాలతో రాజకీయం చేస్తే భంగపాటు తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ ని ఉద్దేశించే ఆయన ఆ కామెంట్స్ చేయడం గమనార్హం.  వచ్చే ఐదేళ్లలో పవన్‌ ప్రజల్లో ఉంటారో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. పవన్‌కళ్యాణ్ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనట్లు తెలిపారు. అయితే.. తాను మాత్రం పార్టీ మారడం లేదని.. జనసేనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu