హద్దు మీరితే తాట తీస్తా.. కన్నబాబు, విజయసాయిలకు పవన్ వార్నింగ్

By sivanagaprasad KodatiFirst Published Nov 3, 2019, 6:33 PM IST
Highlights

ప్రజలు రోడ్ల మీదకు వచ్చారంటే ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని అర్ధమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన లాంగ్‌మార్చ్ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రోడ్ల మీదకు రావాలంటే తనకు సరదా కాదని.. తనకు వేల కోట్లు, వేల ఎకరాలు లేవన్నారు. 

ప్రజలు రోడ్ల మీదకు వచ్చారంటే ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని అర్ధమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన లాంగ్‌మార్చ్ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రోడ్ల మీదకు రావాలంటే తనకు సరదా కాదని.. తనకు వేల కోట్లు, వేల ఎకరాలు లేవన్నారు.

పార్టీని నడపాలంటే కోట్లు అవసరం లేదని.. భావజాలం చాలని ఆయన తెలిపారు. తనను టీడీపీ దత్తపుత్రుడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నింటికి సమాధానం చెబుతానని పవన్ స్పష్టం చేశారు.

తెలంగాణ నడిబొడ్డున ఉద్యమం గురించి మాట్లాడానని.. ఆ దమ్ము చూపించా కాబట్టే ఆర్టీసీ కార్మికులు తనను నమ్మారని ఆయన గుర్తుచేశారు. అధికారం, డబ్బు కోసం తాను వెంపర్లాడేవాడిని కాదని.. రూ.కోట్లు సంపాదించే సినీరంగాన్ని వదులుకున్నానని పవన్ గుర్తుచేశారు.

ఇసుక కొరతతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అద్భుతమైన పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటానని పవన్ తెలిపారు. ఇసుక కొరత వల్ల 26 మంది కార్మికులు చనిపోవడం బాధ కలిగించిందని.. ఇసుక అంటే అభివృద్ధన్నారు.

ఇసుక సమస్యపై ప్రజలంతా రోడ్లపైకి వచ్చారని.. కానీ ఆరు నెలల్లోనే ప్రభుత్వం విఫలమైందని పవన్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు తనకు శత్రువులు కాదని.. మంత్రి కన్నబాబును తామే రాజకీయాల్లోకి తీసుకొచ్చామని, భీమవరం.. గాజువాకల్లో ఓడిపోయినంత మాత్రాన తాము విఫలమైనట్లు కాదని పవన్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ కంటే పదవులు ఎక్కువ కాదన్నారు. 

భవన నిర్మాణ కార్మికులను కాపాడుకోకపోతే జీవిత రథచక్రం ఆగిపోతుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు కరెక్ట్‌గా ఉంటే.. జనసేన పార్టీనే ఉండేది కాదని.. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు వైసీపీకి తెలుసా అని జనసేనాని ప్రశ్నించారు.

ఓటమి, గెలుపు కాదు.. పోరాటమే తమకు తెలుసునని.. టీడీపీకి దత్తపుత్రుడు, బీ టీం అంటూ విమర్శిస్తున్నారని పవన్ దుయ్యబట్టారు. పదవి ఉన్నా లేకపోయినా.. ప్రజలకు సాయం చేస్తానని, వైసీపీ నాయకులు ఇసుకను చాలా తేలికగా మాట్లాడుతున్నారని పవన్ ధ్వజమెత్తారు.

వైసీపీ వాళ్లకు ప్రాణాలపై తీపి ఉందని కానీ తనకు ఆ తీపి లేదన్నారు. తాను ప్రజలకు, కష్టాల్లో ఉన్నవారికే దత్తపుత్రుడినని... భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తన మనసును బలంగా తాకాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కేవలం వైసీపీ హయాంలోనే వచ్చినట్లు మాట్లాడుతున్నారని పవన్ చురకలంటించారు. 

ఇసుక పాలసీలో తప్పులుంటే సరిచేయాలని.. 151 సీట్లతో వచ్చిన బలమైన ప్రభుత్వమని మళ్లీ ఆ స్థాయిలో సీట్లు ఎవరికైనా వస్తాయన్న నమ్మకం తనకు లేదన్నారు. భవన నిర్మాణ కార్మికులను వైసీపీ ప్రభుత్వం రోడ్డున పడేసిందని.. వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు తీసుకునే హక్కు లేదని పవన్ విమర్శించారు.

తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని సూట్‌కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా తనను విమర్శిస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. రెండున్నరేళ్లు వీళ్లు జైలులో ఉన్నారని..సూట్‌కేసు కంపెనీలు పెట్టి జైలుకెళ్లారని, పరిధి దాటితే తాట తీసి కింద కూర్చోబెడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. 

ఏ డీఎన్‌ఏ ఉందని విజయసాయి తనను పెళ్లికి పిలిచారని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి తాను రెండు వారాలు గడువిస్తున్నానని.. చనిపోయిన కార్మికులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని జనసేనాని డిమాండ్ చేశారు.

అలాగే భవన నిర్మాణ కార్మికులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నేనే నడుస్తానని..చంద్రబాబుపై ఉన్న కోపాన్ని కార్మికులపై చూపొద్దని పవన్ హితవు పలికారు. తనను విమర్శించేందుకు కన్నబాబుకు ఉన్న అర్హతేంటన్న పవన్ కల్యాణ్.. కన్నబాబు బతుకు తమకు తెలియనిది కాదని ధ్వజమెత్తారు. 

click me!