వీధి బడిలో చదువుకున్నా.. తిట్లు నాక్కూడా వచ్చు: జగన్‌కు పవన్ సవాల్

Published : Dec 12, 2019, 06:10 PM ISTUpdated : Dec 12, 2019, 06:49 PM IST
వీధి బడిలో చదువుకున్నా.. తిట్లు నాక్కూడా వచ్చు: జగన్‌కు పవన్ సవాల్

సారాంశం

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించిన సౌభాగ్య దీక్షను విరమించారు. రైతులు పవన్‌కు నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేశారు.   

తాను వీధిలో బడిలోనే చదువుకున్నానని.. నా భాష ఎలా ఉంటుందో తెలుసుగా అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా వైసీపీ నాయకులపై మండిపడ్డారు. తిట్లు తిట్టడం తనకు కూడా వచ్చని. బాహాబాహీగా తేల్చుకునేందుకు తాను సిద్ధమేనని పవన్ సవాల్ విసిరారు. 

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో గురువారం నిర్వహించిన సౌభాగ్య దీక్షను విరమించారు. రైతులు పవన్‌కు నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

Also Read:పవన్ కల్యాణ్ రైతు దీక్ష: నాగబాబు సైతం.. (ఫొటోలు)

అన్నదాత కన్నీరు ఆగే వరకు తన పోరాటం కొనసాగుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ పదవుల కోసం పుట్టింది కాదని.. ప్రజల సమస్యల కోసం పుట్టిన పార్టీ అని ఆయన తెలిపారు.

రైతుకు పట్టం కట్టేందుకే జనసేన వుందని పవన్ తెలిపారు. తాను సూట్‌కేస్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టలేదని అందువల్లే వారి కష్టాలు నాకు తెలియవన్నారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వానిగా రైతుల సమస్యలు మాత్రమే తెలుసునన్నారు. 

తాను కాంట్రాక్టులు చెయ్యలేదని.. తనకు సినిమాలు చేయడమే తెలుసునన్నారు. తనకు ఆత్మస్థైర్యం దెబ్బతినలేదని... చాలా చిన్న మడిలో వ్యవసాయం చేశానని పవన్ స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఇంతటి ప్రజా వ్యతిరేకతను తెచ్చుకుందని జనసేనాని ఎద్దేవా చేశారు. అధికారం కోసం తాను పాకులాడనని.. తిట్టు తిట్టడం తనకు తెలుసునని పవన్ హెచ్చరించారు. 

కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయారని.. 150 మంది ఎమ్మెల్యేలు ఎంతని పవన్ వైసీపీపై ధ్వజమెత్తారు. తమ నాయకుల్ని భయపెడుతున్నారని.. అసెంబ్లీలో బోటు ప్రమాద మృతులకు కనీసం సంతాపం తెలపలేదని పవన్ విమర్శించారు. అసెంబ్లీలో తిట్లే ఎక్కువగా ఉన్నాయని..సభను హుందాగా నడపాలని ఆయన సూచించారు. 

ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే తప్పులేదని.. తెలుగు గురించి కూడా ఆలోచించాలని జనసేనాని హితవు పలికారు. తెలుగును ఎలా రక్షించుకోవాలని తమకు తెలుసునన్నారు. 

ధాన్యం సేకరణ కేంద్రానికి తాళం వేసి వైసీపీ జెండా రంగులు వేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు సెలవులుంటాయి కానీ.. రైతులకు ఉండవన్నారు. కూల్చివేతతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ అందరినీ కూల్చివేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

Also Read:కర్నూల్‌లో హైకోర్టుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

ప్రస్తుతం ధాన్యం సేకరణలో మాయాజాలం జరుగుతోందని.. ధాన్యం అమ్మిన రైతులకు రసీదు ఇవ్వడం లేదని పవన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటికి రూ.9 కోట్లు ఖర్చు చేశారని.. ప్రభుత్వంతో తాను తగ్గే మాట్లాడుతున్నానన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని అడుగుతున్నామని పవన్ గుర్తుచేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్