పారిపోతానంటున్నావ్ .. ఎంపీవా, సిగ్గులేదు .. రాజీనామా చేయ్ : ఎంవీవీ సత్యనారాయణపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 12, 2023, 6:23 PM IST
Highlights

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. భార్యా బిడ్డలను, ఆడిటర్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన వాళ్లతోనే విశాఖ ఎంపీ ములాఖత్ అయ్యారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎంపీకి సిగ్గులేదని.. వ్యాపారాలు కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి పారిపోతానని అంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పారిపోయేకాడికి ఎంపీగా ఎందుకు పోటీచేశావ్.. రాజీనామా చేయ్ అంటూ ఎంవీవీని పవన్ డిమాండ్ చేశారు. భార్యా బిడ్డలను, ఆడిటర్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన వాళ్లతోనే విశాఖ ఎంపీ ములాఖత్ అయ్యారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. విశాఖ పర్యటనలో వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సిరిపురం జంక్షన్‌లోని సీబీసీఎన్‌సీ భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

సీబీసీఎన్‌సీ భూములపై ఫాల్స్ జీవోలను ఇచ్చారని ఆరోపించారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇలా ఏ మతానికి చెందిన భూములనైనా వైసీపీ నేతలు వదలరని పవన్ పేర్కొన్నారు. సీబీసీఎన్‌సీ భూముల వ్యవహారం సుప్రీంకోర్ట్, హైకోర్ట్ పరిధిలో వుందని జనసేనాని తెలిపారు. న్యాయస్థానాలకు గౌరవం ఇచ్చి స్టేటస్‌కోనూ కొనసాగించాలని పవన్ డిమాండ్ చేశారు. 

ALso Read: కిడ్నాపర్లతో ఎంపీ ములాఖత్ అంటూ పవన్ వ్యాఖ్యలు.. స్పందించని ఎంవీవీ సత్యనారాయణ

విశాఖపట్నం ప్రశాంతమైన నగరమని.. ఈ ప్రశాంతతను వైసీపీ నాయకులు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం వున్నప్పుడు హైదరాబాద్‌లో ఇలాగే దోపిడీ చేస్తే.. తెలంగాణ వాళ్లు తన్ని తగలేశారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీ నాయకుల కన్ను ఉత్తరాంధ్ర భూములపై పడిందని ఆయన ఆరోపించారు. వాళ్లని ఇలాగే వదిలేస్తే ఉత్తరాంధ్రను డంపింగ్ యార్డ్‌లా మార్చేస్తారని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు బలంగా నిలబడినట్లుగా.. ఇప్పుడు ఉత్తరాంధ్ర కోసం ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులు కూడా నిలబడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తణుకులో చేసినట్లే విశాఖలోనూ టీడీఆర్ బాండ్స్ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. భార్యా బిడ్డలను, ఆడిటర్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన వాళ్లతోనే విశాఖ ఎంపీ ములాఖత్ అయ్యారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 
 

click me!