ఓడిపోతే బెంబేలెత్తిపోను, తలదించను: పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Oct 23, 2019, 4:55 PM IST
Highlights

పవన్ కళ్యాణ్ తో ఉంటే గెలుపు సాధ్యమవుతందని వచ్చేవాళ్లు తనకు వద్దన్నారు. జాతీయ స్ఫూర్తి కలిగిన నాయకులు కావాలని సూచించారు. ఇప్పుడు తనతో ఉన్నవాళ్లంతా నీతి నిజాయితీలతో పనిచేసేవారే తప్ప అధికారం కోసమో, పదవుల కోసమో కాదన్నారు. 

అమరావతి : ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను ఎవరికి తలవంచనని చెప్పుకొచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒంగోలు జిల్లాలో పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించారు.  

ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన తాను బెదిరిపోయేవాడిన కాదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. తాను ప్రజలకు మంచిచేయాలనే తపనతోనే ఎన్నో పోగొట్టుకున్నానని చెప్పుకొచ్చారు. తనకు భారతదేశ భావజాలం అర్థం చేసుకున్నవాడినని చెప్పుకొచ్చారు.   

తనకు జాతీయ స్ఫూర్తి కలిగిన నాయకులు కావాలన్నారు. ఒక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే వెళ్లిపోయే నాయకులు తనకు వద్దన్నారు. తనతోపాటు 25ఏళ్లు ఉండే నాయకులు తమకు కావాలని చెప్పుకొచ్చారు. 

గెలిచినా ఓడినా ప్రజల అండదండలతో ప్రజా శ్రేయస్సుకోసం పనిచేస్తానన్నారు. గెలవడం కోసం గడ్డితినే వ్యక్తిని కాదన్నారు. రాజకీయాల కోసం తాను తలదించుకునే వ్యక్తిని కాదన్నారు. ఎన్నికల్లో గెలవాలన్నదే తన లక్ష్యం అయితే వంద వ్యూహాలు పన్నేవాడినని చెప్పుకొచ్చారు. 

పవన్ కళ్యాణ్ తో ఉంటే గెలుపు సాధ్యమవుతందని వచ్చేవాళ్లు తనకు వద్దన్నారు. జాతీయ స్ఫూర్తి కలిగిన నాయకులు కావాలని సూచించారు. ఇప్పుడు తనతో ఉన్నవాళ్లంతా నీతి నిజాయితీలతో పనిచేసేవారే తప్ప అధికారం కోసమో, పదవుల కోసమో కాదన్నారు. 

ఇటీవల కాలంలో ఎవరు పార్టీలో ఉన్నారో ఎవరు వెళ్లిపోయారో తనకు తెలుసునన్నారు. అన్నీ చూస్తు ఊరుకున్నానని ఆ తర్వాత తనకు తేటనీళ్లు బయటపడ్డాయన్నారు పవన్ కళ్యాణ్. వారు తనకు నష్టం చేసినా, పార్టీనివాడుకుని వదిలేసినా బాధపడే వ్యక్తిని కాదన్నారు. 

  

click me!