Pawan Kalyan: పిఠాపురాన్ని నా స్వస్థలంగా మార్చుకుంటా.. నా పని తీరు చూస్తే మీరే వదులుకోరు : పవన్ కళ్యాణ్

By Mahesh KFirst Published Mar 19, 2024, 8:13 PM IST
Highlights

పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వివరించారు. ఎమ్మెల్యేగా తన పని తీరు చూస్తే ఇక ఎప్పటికీ వదులుకోరని అన్నారు.
 

Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడారు. పిఠాపురం అంటే తనకు ప్రత్యేక అభిమానం అని అన్నారు. గతంలోనే పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావించినా.. ఇక్కడ కులాల ఐక్యత కావాలని వేచి చూశానని వివరించారు. ఇప్పుడు అవి సఫలీకృతం అవుతున్నాయని తెలిపారు. పిఠాపురం నుంచి చేరికలను ఆయన ఆహ్వానించారు. చేరుతున్న నాయకుల పేర్లను స్వయంగా చదివి స్వాగతించారు.

గతంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంటే తన నియోజకవర్గ గెలుపుపై దృష్టి సారించలేకపోయానని, కానీ, ఈ సారి పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలుపు గురించి ఆలోచించాల్సిన పని లేదని ఇక్కడి వారు తనకు చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేగా ఎవరూ ఊహించని స్థాయిలో పని చేస్తానని తెలిపారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత అభివృద్ధి చేయవచ్చో.. తాను పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వివరించారు. పిఠాపురాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని అన్నారు. ఈ నియోజకవర్గం దేశంలోనే పేరు సంపాదించేలా చేస్తానని పేర్కొన్నారు.

Also Read: ఐస్‌క్రీంలో వీర్యం కలుపుతూ.. గలీజు పని.. వరంగల్‌లో వ్యక్తి అరెస్టు (వీడియో)

పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రం దిశ దశను పిఠాపురం నుంచే మారుస్తానని చెప్పారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా చేస్తే తనను వదులుకోరని అన్నారు. తన పని తీరు చూస్తే ప్రజలు ఇక వదులు కోరని తెలిపారు.

click me!