ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తణుకులో నిర్వహించిన కార్యక్రమంలో సెటైర్లు వేశారు. జగన్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసునన్నారు.
తణుకు: జగన్ రౌడీ పిల్లాడు..జగన్ ను జగ్గు భాయ్ అంటారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగ్గుభాయ్, జగ్గు గ్యాంగ్ పాలిస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.జగ్గుబాయ్, జగ్గు గ్యాంగ్ ను ఎలా హ్యాండిల్ చేయాలో జనసేనకు తెలుసునన్నారు.
గురువారంనాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో జనసేన నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జగన్ సంగతి తాము ఇక్కడే తేల్చుకోగలమన్నారు. ఈ విషయమై ప్రధాని మోడీకి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. తన పోరాటం జగన్ పై కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాను పోరాటం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
undefined
వారాహి యాత్ర సందర్భంగా అన్నవరంలో తన చెప్పులు పోయాయన్నారు. కానీ ఈ చెప్పులు మచిలీపట్టణంలో కన్పించాయని తనకు కొందరు చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అత్తారింటికి దారేది అనే సినిమాకు సంబంధించిన పైరసీ కూడ మచిలీపట్టణంలో జరిగిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు
. ఇదే సినిమాకు చెందిన నిర్మాత ప్రసాద్ ను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వేదికపై పిలిచి అందరికీ పరిచయం చేశారు. ప్రసాద్ ఇటీవలనే జనసేనలో చేరారు. ప్రసాద్ స్వస్థలం తణుకు అంటూ పవన్ కళ్యాణ్ జనసైనికులకు పరిచయం చేశారు. తన చెప్పులకు , అత్తారింటికి దారేది సినిమా పైరసీకి లింకేమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకుని వెళ్తున్నామన్నారు. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ జనసైనికులకు సూచించారు. ఏ తప్పు చేయనప్పుడు బయపడే పనే లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. పేదల జీవితాల్లో మార్పులు తీసుకు రావాలని రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి తాను పోరాటం చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను, తన కుటుంబం ఎందుకు విమర్శలను ఎదుర్కోవాలన్నారు. పంచాయితీ వ్యవస్థ ఉన్నప్పుడు , సచివాలయ వ్యవస్థ ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
వారాహి యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్‌సీపీపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కూడ అదే స్థాయిలో ఎదురు దాడికి దిగుతున్నారు. ఒకానొక సమయంలో రెండు పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడ దిగుతున్నారు.