ఇదే విషయంపై నాగబాబు కూడా స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అంటూ మెగా బ్రదర్ ట్వీట్ చేయగా.. ఆ తర్వాత అదే అంశంపై పవన్ కూడా స్పందించారు.
టీటీడీ ఆస్తుల అమ్మకాల విషయం ప్రస్తుతం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఆస్తుల విక్రయం కోసం టీటీడీ పాలక మండలిలోనే తీర్మానం జరిగింది. కాగా.. దీనిపై ఇప్పటికే పలువురు స్పందించగా.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
undefined
‘‘అన్ని హిందూ సంస్థలు, ఆర్గనైజేషన్లు.. టీటీడీ వైపే చూస్తూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిత మత సంస్థలలో టీటీడీ ఒకటి. అలాంటి సంస్థ ఇతరులకు మంచిగా ఆదర్శంగా ఉండాలి’’ అంటూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో ‘‘ భూమి ఎంత చిన్నదైనా దాని విలువ కాలంతోపాటు పెరుగుతూ ఉంటుంది. భూమి ఎప్పుడూ పనికి రాకుండా పోదు. దానిని వినియోగించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. తెలివైన ప్రజలకు ఈ విషయం బాగా తెలుసు. దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంతేకానీ.. వాటిని నాశనం చేసే హక్కు మాత్రం ప్రభుత్వానికి లేదు. కొన్ని లక్షల మంది ప్రజల నమ్మకాలను ప్రభుత్వం నాశనం చేయడం కరెక్ట్ కాదు’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.
కాగా.. ఇదే విషయంపై నాగబాబు కూడా స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అంటూ మెగా బ్రదర్ ట్వీట్ చేయగా.. ఆ తర్వాత అదే అంశంపై పవన్ కూడా స్పందించారు.
‘‘తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామివారి భూములను అమ్మే హక్కు మీకు లేదు..హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను’’ అంటూ నాగబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కాగా.. టీటీడీ ఆస్తుల అమ్మకాల విషయంపై రాజకీయ వివాదం రాజుకుంటోంది. బీజేపీ, సీపీఐ పక్షాలే కాకుండా సామాన్య భక్తజనం టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. తమిళనాడు, రుషికేశ్‌లలో వున్న టీటీడీ ఆస్తుల వేలం ప్రక్రియను ఆపకపోతే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని బీజేపీ, సీపీఐ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.