ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలి: ఎమ్మెల్యే రాపాకతో పవన్

Published : Jun 07, 2019, 02:39 PM ISTUpdated : Jun 07, 2019, 02:49 PM IST
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలి: ఎమ్మెల్యే రాపాకతో పవన్

సారాంశం

అసెంబ్లీ సమావేశాల్లో జనసేన పార్టీ తరపున పార్టీ వాయిస్ ను బలంగా వినిపించాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఒక్కడ్నే కదా అని ఆలోచించవద్దని ఏదైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు సూచించారు.   

విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. విజయవాడలోని పడమట లంకలో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కలిశారు. పవన్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను సారదరంగా ఆహ్వానించారు. 

రాపాక వరప్రసాద్ కు అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురు కాసేపు తాజా రాజకీయాలపై చర్చించుకున్నారు. ఇకపోతే అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు కావడంతో అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. 

అసెంబ్లీ సమావేశాల్లో జనసేన పార్టీ తరపున పార్టీ వాయిస్ ను బలంగా వినిపించాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఒక్కడ్నే కదా అని ఆలోచించవద్దని ఏదైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు సూచించారు. 

అనంతరం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఇకపోతే రాపాక వరప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జనసేన పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న ఏకైక ఎమ్మెల్యే వరప్రసాదరావు కావడం విశేషం.

PREV
click me!

Recommended Stories

నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu
Andhra pradesh: కోటీశ్వ‌రుడిని చేసిన కోడి.. త‌ల‌రాత మార్చేసిన సంక్రాంతి పండ‌గ