ఆంగ్ల మాధ్యమం విషయంలోనే కాకుండా మరో అంశం విషయంలో కూడా రాపాక వరప్రసాద్ పవన్ కల్యాణ్ తో విభేదిస్తున్నారు. దిశ అత్యాచారం, హత్య ఘటనపై పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఆయన విభేదిించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరో ఝలక్ ఇచ్చారు. రైతు సమస్యలపై పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్షకు ఆయన డుమ్మా కొట్టారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని సమర్థించి పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయన పవన్ కల్యాణ్ కు దీక్షకు డుమ్మా కొట్టారు. దానికి ఆయన శాసనసభ సమావేశాలను సాకుగా చూపించారు. కాకినాడలో జరుగుతున్న పవన్ కల్యాణ్ దీక్షకు శాసనసభ సమావేశాల కారణంగానే వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆంగ్ల మాధ్యమం విషయంలోనే కాకుండా మరో అంశం విషయంలో కూడా రాపాక వరప్రసాద్ పవన్ కల్యాణ్ తో విభేదిస్తున్నారు. దిశ అత్యాచారం, హత్య ఘటనపై పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఆయన విభేదిించారు. దిశ కేసు నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలు అని పవన్ కల్యాణ్ అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. దేశం మొత్తం కఠిన శిక్ష వేయాలని కోరితే పవన్ మాత్రం బెత్తం దెబ్బలు చాలు అని అన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం మంచి పనులు చేస్తే సమర్థిస్తానని రాపాక వరప్రసాద్ చెప్పారు. కాకినాడలో పవన్ కల్యాణ్ గురువారం తన దీక్షను ప్రారంభించారు.