చంద్రబాబుతో ములాఖత్ కు భువనేశ్వరికి నో... మండిపడుతున్న టీడీపీ వర్గాలు...

Published : Sep 15, 2023, 01:41 PM ISTUpdated : Sep 15, 2023, 02:36 PM IST
చంద్రబాబుతో ములాఖత్ కు భువనేశ్వరికి నో... మండిపడుతున్న టీడీపీ వర్గాలు...

సారాంశం

జైలులో ఉన్న చంద్రబాబును కలవడానికి భువనేశ్వరి చేసిన అభ్యర్థననలు జైలు అధికారులు నిరాకరించారు. ములాఖత్ కు ఈ వారం అవకాశం లేదని తేల్చారు. 

రాజమహేంద్రవరం : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై గత వారం రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో  ఉన్నారు. ఈ వారంలో ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి ఒకసారి ఆయనతో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత నారా లోకేష్, బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు మూలాఖత్ అయ్యారు. 

కాగా మరోసారి చంద్రబాబు నాయుడుతో ములాఖత్ కు కోరుతూ ఆయన సతీమణి భువనేశ్వరి జైలు అధికారులను అనుమతి అడిగింది. ఈ మూలాఖత్ ను  జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి రెండుసార్లు మాత్రమే కుటుంబ సభ్యులకు మూలాఖత్ కు అవకాశం ఉంటుందని  జైలు అధికారులు చెబుతున్నారు. అయితే వారానికి మూడుసార్లు  ములాఖత్ కు అవకాశం ఉంటుందని టిడిపి చెబుతోంది. ఈ నేపథ్యంలోనే భువనేశ్వరి అభ్యర్థనను తిరస్కరించడానికి తప్పుపడుతోంది తెలుగుదేశం.

కాగా, తన భర్త చంద్రబాబుతో ములాఖత్ ను నిరాకరించడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేవారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి ములాఖత్ మీద కూడా అమానవీయంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. నిబంధనల ప్రకారం ములాఖత్ కు అవకాశం ఉన్నా నిరాకరించడంపై సరికాదని ఆమె అన్నారు.

Chandrababu : చంద్రబాబు అరెస్ట్‌పై సమగ్ర నివేదికను సమర్పించిన ఎన్‌ఎస్‌జీ

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత భువనేశ్వరి రాజమహేంద్రవరం లోనే ఉంటున్నారు. తన భర్తను కలవడానికి ములాఖత్ కు నిరాకరించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా అరెస్టు చేసి, ములాఖత్ కు కూడా ఒప్పుకోకపోవడం అమానవీయంగా ఆమె ఆక్షేపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ములాఖత్ కు అవకాశం ఉందని..  అయినా కూడా కాదనడం సరికాదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే మరోసారి కలవాలంటే  నేరుగా జైలు  సూపరిండెంట్  అనుమతి ఉండాలి.  ప్రస్తుతం ఆయన సెలవుల్లో ఉండడంతో ఇది వీలు కాదని సమాచారం.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?