మా పరిస్ధితి చూడండి.. పోలవరం ఖర్చులు ఇచ్చేయండి: కేంద్రానికి ఏపీ లేఖ

By Siva KodatiFirst Published Jun 13, 2019, 5:44 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చులను వెనక్కి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు.. ఆర్ధిక శాఖ అనుమతి కోసం దస్త్రాన్ని పంపారు

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చులను వెనక్కి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు.. ఆర్ధిక శాఖ అనుమతి కోసం దస్త్రాన్ని పంపారు.

కేంద్ర ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శి ఆమోదం తర్వాతే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.  ఆర్ధిక శాఖ అనుమతి వచ్చిన అనంతరం దస్త్రాన్ని జలవనరుల శాఖ నాబార్డుకు పంపనుంది.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది.. అయినప్పటికీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసింది. ఆ మొత్తాన్ని కేంద్రప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నా కొంత ఆలస్యం నెలకొంది.

అయితే ఏపీ నూతన సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ క్రమంలో రాష్ట్రం పెట్టిన ఖర్చు మొత్తాన్ని కేంద్రం నుంచి రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల జరిగిన సమీక్షలో ఆయన అధికారులను ఆదేశించారు.

అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలవరంపై పెట్టిన ఖర్చులను చెల్లించాలని అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 
 

click me!