పోలవరం కాంట్రాక్టర్ నవయుగపై ఐటి దాడులు

By Nagaraju TFirst Published Oct 25, 2018, 1:05 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఆ ఘటన మరువకుమందే గురువారం ఐటీ దాడులు మళ్లీ కలవరం రేపాయి. రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలే లక్ష్యంగా ఐటీ సోదాలు జరుగుతుండటంతో ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఆ ఘటన మరువకుమందే గురువారం ఐటీ దాడులు మళ్లీ కలవరం రేపాయి. రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలే లక్ష్యంగా ఐటీ సోదాలు జరుగుతుండటంతో ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గురువారం తెల్లవారు జాము నుంచే ఐటీ అధికారులు హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో విపరీతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న నవయుగ కనస్ట్రక్షన్ కు సంబంధించి 47 కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా ఐటీ రిటర్న్స్, ప్రాజెక్టుల నిర్వవహణపై విచారణ చేస్తున్నారు.

అయితే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఐటీ ఆర్వోసీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ తోపాటు, నవయుగ బెంగుళూరు టోల్ వే ప్రవైట్ లిమిటెడ్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ క్వాజీగంఢ్ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

అలాగే కృష్ణా డ్రెడ్జింగ్ కంపెనీ లిమిటెడ్, కృష్ణ కంపెనీ పోర్టు  లిమిటెడ్, శుభం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్  లావాదేవీలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. నవయుగ కంపెనీ సి.విశ్వేశ్వరరావు అనే వ్యాపారవేత్తకు చెందిన కంపెనీ.  

click me!