భయాలు నిజమవుతున్నాయి: చంద్రబాబు ఆవేదన

By Nagaraju TFirst Published Oct 25, 2018, 12:44 PM IST
Highlights

కేంద్రప్రభుత్వం వ్యవహార శైలిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు చూస్తుంటే విభజన సమయంలో మనకున్న భయాలు నిజమవుతున్నాయన్నారు. అమరావతిలో జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు భయాలను సృష్టించేలా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 

అమరావతి: కేంద్రప్రభుత్వం వ్యవహార శైలిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు చూస్తుంటే విభజన సమయంలో మనకున్న భయాలు నిజమవుతున్నాయన్నారు. అమరావతిలో జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు భయాలను సృష్టించేలా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ వ్యాపారం చేసే వారు లేరని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అయితే ఎన్ డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తుఫాన్ కరువుతో రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. 

జాతీయ వృద్ధి రేటు కన్నా మన వృద్ధి రేటు అధికంగా ఉందన్న చంద్రబాబు నాయుడు కేంద్రం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను సైతం వెనక్కి లాగేసుకుందని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిధులిచ్చారని తెలిపారు. మరోవైపు సీబీఐను సైతం కేంద్రం భ్రష్టుపట్టించిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సీబీఐను నిర్వీర్యం చేసేలా కేంద్రం వ్యహరిస్తోందని ఆరోపించారు.  తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాత్రి రాత్రే సీబీఐ డైరెక్టర్ ను మార్చారని మండిపడ్డారు. 

మరోవైపు తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఉన్నతాధికారులు పని చేసిన తీరు అద్భుతంగా ఉందని చంద్రబాబు ప్రశంసించారు. 
తుఫాన్ కరువుతో రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తిత్లీ తుఫాన్ సహాయక చర్యల్లో అద్భుతంగా పనిచేశారు. 
 

click me!