కన్నాను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత లేదు: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

Published : Dec 15, 2022, 12:31 PM IST
కన్నాను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత లేదు: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

సారాంశం

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను కలవడంలో  రాజకీయ ప్రాధాన్యత లేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  పార్టీ మారితే  ముందే  ప్రకటిస్తానన్నారు. 

విజయవాడ: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత లేదని  మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  చెప్పారు. గురువారంనాడు  మాజీ మంత్రి విజయవాడలో  మీడియాతో మాట్లాడారు. పార్టీ మారే ఆలోచన ఉంటే ముందే చెబుతానని  గంటా శ్రీనివాసరావు  స్పష్టం చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూతురు పెళ్లి సందర్భంగా కలిసినట్టుగా  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు. వంగవీటి రంగా వర్ధంతి అంశంపై  ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

బుధవారం నాడు రాత్రి విజయవాడలోని మాజీ మంత్రి  గంటా శ్రీనివాసరావు  నివాసంలో  కన్నా లక్ష్మీనారాయణ; బొండా ఉమా మహేశ్వరరావు,  బాలాజీ సహా మరికొందరు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  రాష్ట్రంలో  రాజకీయ పరిస్థితిపై చర్చించారు. కాపులు రాజకీయంగా ఎదిగేందుకు  ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయమై చర్చించారు. 

also read:గంటా శ్రీనివాసరావు నివాసంలో కాపు నేతల భేటీ: రాష్ట్ర రాజకీయాలపై చర్చ

గత కొంతకాలంగా  కాపులకు ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే చర్చ ఆ సామాజిక వర్గంలో  ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై  నేతల మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం.2019 ఎన్నికల్లో  టీడీపీ అధికారానికి దూరమైంది. ఆ తర్వాత  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.  మరికొందరు నేతలు  వైసీపీ, బీజేపీలలో చేరారు. గంటా శ్రీనివాసరావు కూడా  టీడీపీని వీడుతారని ప్రచారం సాగింది. కానీ  తాను  పార్టీ మార

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్