(వీడియో) వైసీపీలోకి చక్రపాణిరెడ్డి..ఫిక్స్..శ్రీశైలం నుండి పోటి ?

Published : Jul 31, 2017, 03:56 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
(వీడియో) వైసీపీలోకి చక్రపాణిరెడ్డి..ఫిక్స్..శ్రీశైలం నుండి పోటి ?

సారాంశం

టిడిపి ఎంఎల్సీ, జిల్లాలో సినియర్ నేత శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీలో కూడా అన్నదమ్ముల అనుబంధం కొనసాగనున్నట్లే అనిపిస్తోంది. నంద్యాలలో పోటీ విషయంలోనే మోహన్ రెడ్డి టిడిపిని వదిలేసి వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి టిడిపిలోనే ఉన్న చక్రపాణిరెడ్డిని అందరూ దూరం పెట్టటం మొదలుపెట్టారు.

టిడిపి ఎంఎల్సీ, జిల్లాలో సినియర్ నేత శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీలో కూడా అన్నదమ్ముల అనుబంధం కొనసాగనున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే, ఏ పార్టీలో ఉన్నా ఇద్దరూ ఉంటారు. కాకపోతే ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ముందు శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరితే కాస్త ఆలస్యంగా చక్రపాణిరెడ్డి చేరబోతున్నట్లు సమాచారం.

వాస్తవానికి నంద్యాలలో పోటీ విషయంలోనే మోహన్ రెడ్డి టిడిపిని వదిలేసి వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి టిడిపిలోనే ఉన్న చక్రపాణిరెడ్డిని అందరూ దూరం పెట్టటం మొదలుపెట్టారు. దాంతో చక్రపాణికి ఇబ్బందులు మొదలయ్యాయి. చక్రపాణి కూడా ఎప్పుడో ఒకపుడు వైసీపీలోకి వెళిపోతారనే అందరూ అనుకుంటున్నదే. సోమవారం శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డిని కలవటంతో అందరి అనుమానాలు నిజమవుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

సోదరుల భేటీ తర్వాత మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన అభ్యర్ధిత్వానికి, విజయానికి మద్దతు ఇవ్వాల్సిందిగా చక్రపాణిరెడ్డిని కోరినట్లు చెప్పటంతో అందకి అనుమానాలు నిజమయ్యేట్లే ఉంది. ఎందుకంటే, ఎంతసోదరుడైనా బహిరంగంగా ప్రత్యర్ధి పార్టీలో ఉన్న వారి మద్దతు అడగటముండదు. లోపాయికారీగా ఏవో మాట్లాడుకోవటం మామూలే. కానీ మోహన్ రెడ్డి బహిరంగంగా మద్దతు కోరినట్లు చెప్పారు. చక్రపాణిరెడ్డి కూడా ఆలోచించుకుని చెబుతానని చెప్పారట.

అదీకాకుండా, వచ్చే నెల 3వ తేదీన జగన్ నంద్యాలలో బహిరంగసభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఆ సందర్బంగా చక్రపాణిరెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకున్నది. వచ్చే ఎన్నికల్లో చక్రపాణిరెడ్డి శ్రీశైలం నుండి పోటీ చేసేందుకు జగన్ కూడా అంగీకరించాని లోటస్ పాండ్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయ్.

PREV
click me!

Recommended Stories

“ఆవకాయ్ అమరావతి” Festival Announcement | Minister Kandula Durgesh Speech | Asianet News Telugu
Nara Bhuvaneshwari Launches Free Mega Medical Rampachodavaram Under NTR Trust | Asianet News Telugu