సంచలనం: ప్రభుత్వంలో అవినీతిపై సిబిఐకి లేఖ ?

First Published Apr 9, 2018, 5:25 PM IST
Highlights
పలువురు నేతలు విడివిడిగా ప్రభుత్వ అవినీతిపై కోర్టు మెట్లుక్కుతున్నట్లు కూడా ప్రచారం ఊపందుకుంది.

చంద్రబాబునాయుడు భయపడుతున్నది నిజంగానే జరగబోతోందా ? తనతో పాటు తన కొడుకు, కొందరు మంత్రులపై త్వరలో దాడులు జరుగనున్నట్లు కొద్ది రోజుల క్రితం చంద్రబాబు చేసిన ప్రకటన సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇపుడదే నిజం కాబోతోందా అన్న అనుమానాలు సర్వత్రా మొదలయ్యాయి.

ఎందుకంటే, చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు సిబిఐకి ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సందర్భంలో పలువురు నేతలు విడివిడిగా ప్రభుత్వ అవినీతిపై కోర్టు మెట్లుక్కుతున్నట్లు కూడా ప్రచారం ఊపందుకుంది.

ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు,  ప్రధానంగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో పాటు స్వచ్ఛభారత్ తదితర పథకాల్లో ప్రధానంగా అవినీతి జరిగిందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో భారీ ఎత్తున పక్కదారి పట్టిందంటూ కమలం పార్టీ నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఒకవేళ జరుగుతున్న ప్రచారమే గనుక నిజమైతే త్వరలో పలువురిపై సిబిఐ దాడులు మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, ఇదే విషయాన్ని ఏషియా నెట్ వీర్రాజును సంప్రదించగా ఆయన ధృవీకరించలేదు అలాగని నిరాకరించనూ లేదు. ‘రాజకీయలన్నాక అనేకం జరుగుతుంటాయన్నారు’. ‘ఎంతవరకూ చెప్పాలో అంత వరకే చెబుతామ’న్నారు.

 

 

 

click me!