సర్వే : విశాఖలో టీడీపీ ఫస్ట్.. వైసీపీ లాస్ట్

By ramya neerukondaFirst Published Nov 27, 2018, 3:51 PM IST
Highlights

. విశాఖలో ప్రస్తుతం ఓ తాజా సర్వే కలకలం రేపుతోంది.  ఇన్ సోల్ సొల్యూషన్స్ అనే సంస్థ  స్వతంత్రంగా చేపట్టిన సర్వేలో టీడీపీ నేత స్వాతి కృష్ణారెడ్డి దూసుకుపోతున్నారు.

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నంచే పార్టీ నుంచి టికెట్ దక్కించుకునేందుకు ఆ తర్వాత ప్రజల నుంచి ఓట్లు వేయించుకనేందుకు నేతలు సన్నద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే.. విశాఖలో ప్రస్తుతం ఓ తాజా సర్వే కలకలం రేపుతోంది.  ఇన్ సోల్ సొల్యూషన్స్ అనే సంస్థ  స్వతంత్రంగా చేపట్టిన సర్వేలో టీడీపీ నేత స్వాతి కృష్ణారెడ్డి దూసుకుపోతున్నారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనుకునే కొందరు అభ్యర్థుల పేర్లతో సర్వే  చేపట్టగా.. స్వాతి కృష్ణా రెడ్డి కే ఎక్కువ మంది మొగ్గు చూపడం విశేషం. ఇప్పటికప్పిడు ఎన్నికలు జరిపినా.. ఆయనే గెలుస్తారని ఆ సర్వేలో తేలింది. ఇక ఆయన తర్వాతి స్థానంలో వైసీపీ నేత గుంటూరు భారతి ఉన్నారు. అయితే.. వీరిద్దిరికీ ఓట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మూడో స్థానంలో టీడీపీ మరోనేత ఎలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ ఉన్నారు. ఆయన తర్వాత నాలుగో స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు.

విష్ణుకుమార్ రాజుకి స్వతహాగా మంచిపేరు ఉన్నప్పటికీ.. పార్టీకి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఇక ఆఖరి స్థానంలో వైసీపీ నేత కేకే రాజు మిగిలారు. అసలు కేకే రాజు పేరు కూడా  చాలామందికి తెలియకపోవడం గమనార్హం.

స్వాతి కృష్ణా రెడ్డి టీడీపీలో చేరిన నాటి నుంచి అకింతభావంతో పనిచేస్తున్నారు. తనదైన శైలిలో అటు పార్టీలోనూ, ఇటూ జనాలలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ప్రజలు సర్వేలో ఆయనవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి విశాఖ ఉత్తరంలో రెడ్డి కులానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ.. ఆయన చేపడుతున్న మంచి కార్యక్రమాల కారణంగా ఆయనకు ఓట్లు ఎక్కువ పడినట్లు తెలుస్తోంది.

click me!