శారద పీఠాధిపతి స్వరూపానందతో సీపీఐ నారాయణ ఆసక్తికర సంభాషణ

Published : Mar 03, 2021, 04:29 PM IST
శారద పీఠాధిపతి స్వరూపానందతో సీపీఐ నారాయణ ఆసక్తికర సంభాషణ

సారాంశం

విశాఖలో శారద పీఠాధిపతి స్వరూపానందస్వామితో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ బుధవారం నాడు భేటీ అయ్యారు.

విశాఖపట్టణం: విశాఖలో శారద పీఠాధిపతి స్వరూపానందస్వామితో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ బుధవారం నాడు భేటీ అయ్యారు.

విశాఖపట్టణంలో ఎన్నికల ప్రచారంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ బుధవారం నాడు పాల్గొన్నారు. 97వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 
ఈ సందర్భంగా శారద పీఠానికి నారాయణ వెళ్లారు. శారద పీఠాధిపతి స్వరూపానందతో నారాయణ బేటీ అయ్యారు.

మిమ్మల్ని కలిసి గెలిపించాలని కోరితే ఎన్నికల్లో గెలిపిస్తారంట అని స్వరూపానందతో నారాయణ వ్యాఖ్యానించారు.ఈ ఎన్నికల్లో తమ అభ్యర్ధిని కూడ గెలిపించాలని ఆయన స్వరూపానందను కోరారు. దీంతో ఇరువురు నవ్వారు.

విశాఖ కార్పోరేషన్ ను కైవసం చేసుకోవాలని టీడీపీ, వైసీపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విశాఖ నగరంలో కార్మిక వర్గం కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపనుంది. ఈ ఎన్నికల్లో కార్మికులు  ఏ రకంగా వ్యవహరిస్తారోననేది  ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్