మహేష్ కత్తి కళ్లకు శస్త్ర చికిత్స: ఆరోగ్య పరిస్థితిపై రెండు రోజుల్లో క్లారిటీ

Published : Jun 29, 2021, 08:41 AM IST
మహేష్ కత్తి కళ్లకు శస్త్ర చికిత్స: ఆరోగ్య పరిస్థితిపై రెండు రోజుల్లో క్లారిటీ

సారాంశం

నెల్లూరు జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు మహేష్ కత్తి కళ్లకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయన తలకు, కళ్లకు ప్రమాదంలో తీవ్రమైన గాయాలు అయినట్లు వైద్యులు చెబుతున్నారు.

చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జరిగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు కత్తి మహేష్ కళ్లకు సోమవారం శస్త్ర చికిత్స జరిగింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

ప్రమాదంలో మహేష్ కత్తి కళ్లకు, తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రమాదంలో మహేష్ కత్తికి తీవ్రమైన గాయాలు అయ్యాయని, వెంటిలేటర్ మీద ఆయన చికిత్స పొందుతున్నారని వైద్యులు అంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒకటి రెండు రోజుల తర్వాతనే స్పష్టత వస్తుందని అంటున్నారు. అయితే, ఆయనకు ప్రాణాపాయం తప్పినట్లేనని వైద్యులు చెబుతున్నారు.

నెల్లూరు: చెన్నై-- కలకత్తా రహదారిపై శనివారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం నెల్లూరులోని మెడికవర్ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మహేష్ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.

స్పెషల్ ఐసోలేషన్ లో వెంటిలేటర్ మీద ఉంచి మహేష్ కు డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు చెప్పారు. కత్తి మహేష్ పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం. 

డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కత్తి మహేష్ ను పోలీసులు, హైవేపై గస్తీ చేస్తున్న సిబ్బంది గుర్తు పట్టారు. వెంటనే మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. కత్తి మహేష్ బంధువులు, స్నేహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అనుచరులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu