బావ లైంగిక దాడితో బిడ్డను కన్న మహిళ: శిశువును మాయం చేసిన లేడీ డాక్టర్

Published : Feb 09, 2019, 11:18 AM IST
బావ లైంగిక దాడితో బిడ్డను కన్న మహిళ: శిశువును మాయం చేసిన లేడీ డాక్టర్

సారాంశం

కనకదుర్గ అక్క మొగుడు రమణ తరచూ అత్తింటికి వస్తూ కనకదుర్గతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అనేక మార్లు ఆమెపై లైంగికదాడి చేయడంతో గర్భం దాల్చింది. విషయం కాస్తా చేయి దాటిపోవడంతో ఈ నెల 3వ తేదీన ప్రసవం నిమిత్తం రాజుపేటలోని వాణికుసుమ ఆస్పత్రి వైద్యురాలు వాణికుసుమను తల్లి నరసమ్మ కలిసింది. 

మచిలీపట్నం: జన్మనిచ్చిన తల్లికి కూడా ఆ శిశువును చూపించకుండా ఓ వైద్యురాలు డ్రామా ఆడి, బుకాయించింది. ఓ మహిళ కన్న మగ శిశువును ఇతరులకు విక్రయించింది. ఆ శిశువును తల్లికి చూపించకుండా వేరే ప్రాంతానికి తరలించింది. అడిగితే బుకాయించింది. మహిళకు ప్రసవం కాలేదని, కడుపులో గడ్డ ఉందని చెప్పింది. 

దాంతో మహిళ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈసంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం చోటు చేసుకుంది.  బందరు మండలం సత్రవపాలెంకు చెందిన చిన్నం వెంకటనరసమ్మ కూలి పనులు చేస్తుంటుంది. ఆమెకు నలుగురు సంతానం కాగా కనకదుర్గ పుట్టుకతోనే వికలాంగురాలు. 

దాంతో ఆమెకు సంబంధాలు రాలేదు. ఆ కారణంగా ఆమె తల్లితోనే కలసి ఉంటుంది. అయితే, కనకదుర్గ అక్క మొగుడు రమణ తరచూ అత్తింటికి వస్తూ కనకదుర్గతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అనేక మార్లు ఆమెపై లైంగికదాడి చేయడంతో గర్భం దాల్చింది. విషయం కాస్తా చేయి దాటిపోవడంతో ఈ నెల 3వ తేదీన ప్రసవం నిమిత్తం రాజుపేటలోని వాణికుసుమ ఆస్పత్రి వైద్యురాలు వాణికుసుమను తల్లి నరసమ్మ కలిసింది. 

విషయం వివరంగా చెప్పి ఆపరేషన్‌ చేయాలని కోరింది. అందుకోసం వైద్యురాలు పెద్ద మొత్తంలో  డబ్బు డిమాండ్‌ చేయగా నరసమ్మ తగిన మొత్తంలో ముట్టజెప్పింది. ఆదివారం కనకదుర్గను ఆస్ప త్రిలో చేర్చగా సోమవారం ఆమెకు ఆపరేషన్‌ చేశారు. కనకదుర్గ మగబిడ్డకు జన్మనిచ్చింది.

పుట్టిన బిడ్డను ఆ వైద్యురాలు తల్లికి చూపించకుండా ఉంచింది. మూడు రోజులు అలా గడిచిపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలి తల్లి నరసమ్మ వైద్యురాలిని కలిసి పుట్టిన బిడ్డను చూపించాలంటూ వేడుకుంది.

రంగంలోకి దిగిన పోలీసులు వైద్యురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్సీషియనే బిడ్డను అపహరించి మచిలీపట్నం దాటించినట్టుగా పోలీసులు  గుర్తించారు. ప్రస్తుతం  శిశువు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu