ప్రేమించి పెళ్లిచేసుకున్నవాడి వేధింపులు.... వివాహిత ఆత్మహత్య

Published : Feb 09, 2019, 11:00 AM IST
ప్రేమించి పెళ్లిచేసుకున్నవాడి వేధింపులు.... వివాహిత ఆత్మహత్య

సారాంశం

వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కులాలు వేరయినప్పటికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భర్త అసలు బుద్ది బయటపడింది. పుట్టింటినుంచి డబ్బులు తీసుకురావాలని భార్యను వేదించడం ప్రారంభించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ఇలా వేదింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేకపోయిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుుకుంది.   

వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కులాలు వేరయినప్పటికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భర్త అసలు బుద్ది బయటపడింది.  పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని భార్యను వేదించడం ప్రారంభించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ఇలా వేదింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేకపోయిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

 మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన నవీన్(25), ప్రియాంక అనే యువతిని ప్రేమించాడు.  వీరి కులాలు వేరు కావడంతో మొదట ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. అయితే వీరు తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఒప్పించి వారి అనుమతితో పెళ్లి చేసుకున్నారు. 

ఇలా ప్రేమికులిద్దరు పెళ్లి బంధంతో భార్యాభర్తలుగా మారారు. అయితే గ్రానైట్ వ్యాపారం నిర్వహించే నవీన్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో వాటి నుండి బయటపడేందుకు భార్యను వేదించడం ప్రారంభించాడు. పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలంటూ వేదించేవాడు.  ఈ మధ్య ఆ వేదింపులు మరీ ఎక్కువవడంతో తట్టుకోలేకపోయిన ప్రియాంక దారుణమైన నిర్ణయం తీసుకుంది. 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియాంక సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఇదే సమయంలో కూతురి ఇంటికి వచ్చిన తల్లి రోజారమణి దీన్ని గమనించి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక మృతిచెందింది. 

 తమ కూతురు ప్రియాంక చావుకి ఆమె భర్త, అత్తా మామలే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.    
 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu