AP News: అయ్యో దేవుడా! చిన్నారిని కబళించిన నిమ్మకాయ.. ఏడేళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కూతురు

By Mahesh KFirst Published Jan 11, 2024, 5:38 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఓ నిమ్మకాయ వారి ఇంటిలో విషాదాన్ని నింపింది. ఏడేళ్ల తర్వాత పుట్టిన ఏకైక బిడ్డను కబళించి దంపతుల జీవితాల్లో తీరని శోకాన్ని నింపింది.
 

Lemon: ఓ నిమ్మకాయ వారి ఇంటిలో విషాదాన్ని నింపింది. జీవితాంతం కుమిలిపోయే శోకాన్ని కలిగించింది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క బిడ్డను తీసుకెళ్లింది. కళ్ల ముందే గిలగిల కొట్టుకుంటూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయత వారందరినీ బాధించింది. నిమ్మకాయ తొమ్మిది నెలల ఆ పాప గొంతులోకి జారి శ్వాస కోసం గింజుకుంది. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే ఆ పసిబిడ్డ అలసిపోయింది. ఆ బాలిక అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

మల్లేనిపల్లికి చెందిన వాలంటీర్ సకీదీప, గోవిందరాజులు దంపతులు. సంతానం కోసం ఏడేళ్లు వేచి చూశారు. కుమార్తె రూపంలో కలిగిన సంతాన ఫలితాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు. ఆమె బుడిబుడి అడుగులతో ఇంటిలో నడయాడుతుంటే సంతోషపడ్డారు. ఇంతలోనే వారికి తీరని బాధ ఎదురైంది.

Latest Videos

తొమ్మిది నెలల ఆ బాలిక ఇంటి వరండాలో ఆడుకుంటూ ఉండగా.. ఓ నిమ్మకాయ కనిపించింది. ఆ నిమ్మకాయను తీసి నోట్లో పెట్టుకుంది. తల్లి సకీదీప ఇది గమనించింది. వెంటనే బిడ్డ దగ్గరికి పరుగున వెళ్లింది. ఆ నిమ్మకాయను నోటిలో నుంచి తీసే ప్రయత్నం చేసింది. కానీ, అకాస్మాత్తుగా ఆ నిమ్మకాయ మరింత లోపటికి గొంతులోనికి జారింది.

Also Read: ప్రధాని మోడీ జోక్యంతో ఉక్రెయిన్ యుద్ధం తాత్కాలికంగా ఆగింది: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

బాలికను వెంటనే పెద్దవడుగూరు హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అప్పటికే బాలిక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో మెరుగైన వైద్యం కోసం పామిడికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ వైద్యులు బాలిక జశ్వితను పరిశీలించి ఆమె అప్పటికే మరణించినట్టు నిర్దారించారు.

click me!