మచిలీపట్నంలో దారుణం...వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే పసికందు మృతి (videos)

Published : May 10, 2022, 10:58 AM IST
మచిలీపట్నంలో దారుణం...వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే పసికందు మృతి (videos)

సారాంశం

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మహిళ కడుపులోనే శిశువు మృతి చెందింది. దీంతో బంధువుల ఆందోళనకు దిగారు. 

కృష్ణాజిల్లా : Machilipatnam ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంగా వల్ల తల్లి కడుపులోనే Infant  మృతి చెందింది. గొడుగుపేట నుండి వచ్చిన ఓ మహిళ delivary కోసం ఆసుపత్రిలో చేరింది. మహిళను పరీక్షించి అంతా బాగానే ఉంది రేపు ఉదయం ఆపరేషన్ చేస్తామని చెప్పిన వైద్యులు తెలిపారు.

"

కాగా, అదే రోజు రాత్రి తల్లి కడుపులో శిశువు చనిపోయింది. దీంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని మహిళ బంధువులకు వైద్యులు తెలిపారు. దీంతో  వైద్యుల మాటలతో మహిళ బంధువులు కంగుతిన్నారు. అంతా బాగానే ఉందని చెప్పారు.. అంతలోనే శిశువు చనిపోయిందంటున్నారని ఆందోళన చెందారు. 

సాయంత్రం వరకు హెల్టీగా ఉందని చెప్పిన గర్భస్థ శిశువుకు ఎం జరిగింది? ఎందుకు చనిపోయింది కారణాలు చెప్పాలని డాక్టర్లను బాధితులు నిలదీశారు. డాక్టర్ల నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఆసుపత్రిలోనే మహిళా కుటుంబ సభ్యులు  నిరసనకు దిగారు.

కాగా, ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి ఉండగా కన్సల్ట్ సంతకం చేయడానికి మహిళా కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ఆపరేషన్ నిలిచిపోయింది. 

PREV
click me!

Recommended Stories

డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu
YS Jagan Strong Warning: మనం విలీనం చెయ్యకపోతే చంద్రబాబు ఆర్టీసీ ని అమ్మేసేవారు| Asianet News Telugu