
అనంతపురం : ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయిజిల్లా కదిరి నియోజకవర్గంలో అమానుష ఘటన వెలుగు చూసింది. చదువుకోవడానికి పాఠశాలకు వచ్చిన విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ ఉపాధ్యాయుడి కామలీలలు ఆలస్యంగా వెలుగు చూసాయి. దీనిమీద ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో అది వాస్తవమేనని తేలడంతో గురువారం ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. కదిరి నియోజకవర్గం నల్లగుంట్ల పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ పాఠశాలలో ఆదినారాయణ ఇన్చార్జి హెడ్మాస్టర్ గా ఉన్నాడు.
స్కూల్లోని ఎనిమిది, తొమ్మిది, 10వ తరగతి విద్యార్థినులపై కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతడి వయసు 61 సంవత్సరాలు. అంత వయసులో మనవరాళ్ల వయసున్న విద్యార్థినులపై వక్రబుద్ధిని చూపించాడు. వారి పుట్టుమచ్చలు చూపాలంటూ వేధిస్తున్నాడు. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ఏం జరుగుతుందోనని.. దీంతో పాటు ఆదినారాయణ టీచర్ కు భయపడిన విద్యార్థినులు ఎవరికి ఈ విషయాన్ని చెప్పుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా.. పాఠశాలలో ఓ కార్యక్రమం జరిగింది.
పీవీ సునీల్ కుమార్‌కు ఎట్టకేలకు పోస్టింగ్.. ఫైర్ సర్వీసెస్‌గా నియామకం , జగన్ సర్కార్ ఆదేశాలు
దీనికి ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హాజరయ్యారు. బాలికలు ఆ ప్రతినిధితో తమ గోడు వెల్లబోసుకున్నారు. బాలికలకు ఈ విషయంలో న్యాయం చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు ఉపాధ్యాయుడి తీరును గమనించారు. అతడి మీద బాలికలు చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో ఈ విషయం మీద అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షికి సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు వెంటనే అధికారులు రంగంలోకి దిగిన అధికారులు జీవి ఆది నారాయణ మీద విచారణ జరిపారు. వాస్తవాలు తేలడంతో అతడిని సస్పెండ్ చేశారు. నారాయణ మీద పోక్సో కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎంఈఓ లలితమ్మ అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఓ ఘటన బీహార్లోని బెగుసరాయి జిల్లాలో జరిగింది. ఇద్దరు చిన్నారులపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..బెగుసరాయి జిల్లాలోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలు ఆడుకుంటున్నారు, వారి మీద ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఆ వ్యక్తి చేష్టలు వికృతంగా అనిపించడంతో భయాందోళనకు గురైన ఆ బాలికలు ఇద్దరు స్కూల్లోని టాయిలెట్ లోకి వెళ్లి దాక్కున్నారు. అయితే నిందితుడు మరుగుదొడ్డి పైకప్పును విరగొట్టి టాయిలెట్ లోకి ప్రవేశించాడు. వారి మీద అత్యాచారయత్నం చేశాడు.
ఈ విషయం తెలిసి పోలీసులు సదరు వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.బాధిత బాలికలు ఇద్దరు పాఠశాల ఆవరణలో ఉన్న ఉయ్యాలను ఊగేందుకు వెళ్లారు. పాఠశాలలోనే ఉన్న ఛోటూ మహాతో అనే వ్యక్తి వారిద్దరిని చూశాడు. బాలికల దగ్గరికి వచ్చి వారి మీద లైంగిక వేధింపులకు పాల్పడడం ప్రారంభించాడు. అతడి చేష్టలకు ఇద్దరు బాలికలు బెదిరిపోయారు. వారిని బయటికి వెళ్ళనీయకుండా అతడు అడ్డుపడుతుండడంతో పరిగెత్తి టాయిలెట్లోకి వెళ్లారు. అక్కడ దాక్కున్నాడు. అది ఛోటూ మహాతో గమనించాడు.
వెంటనే టాయిలెట్ తలుపులు ఎంత కొట్టినా బాలికలు తీయకపోవడంతో.. మరుగుదొడ్డి పైకప్పు పగలగొట్టాడు. అందులో నుంచి లోపలికి దూరాడు. ఆ తర్వాత ఓ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మరో చిన్నారి అక్కడి నుంచి తప్పించుకుని బయటపడింది. వెంటనే తమ కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంతో వారు అక్కడికి చేరుకుని అమ్మాయిని రక్షించారు. బాలికలు ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన వారు ఛోటూ మహాతోను అరెస్టు చేశారు.