
ఏపీ ఫైర్ సర్వీసెస్ డీజీగా పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఫైర్ సర్వీసెస్ డీజీగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో సునీల్ కుమార్‌ను జీఏడీకి పంపింది ప్రభుత్వం.
కాగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీవీ సునీల్ కుమార్‌కు సీఐడీ చీఫ్ పదవిని కట్టబెట్టింది. దీంతో ఆయన సీఎం జగన్‌కు వీర విధేయుడిగా వ్యవహరించాడన్న విమర్శలు వచ్చాయి. విపక్షాలు ఎన్నో విమర్శలు చేయడంతో పాటు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్ధితుల్లో సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకుంది. ఆయనకు అదనపు డీజీ హోదా ఇచ్చినట్లే ఇచ్చి, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కానీ పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. తాజాగా సునీల్ కుమార్‌కు ఫైర్ విభాగం హెడ్‌గా బాధ్యతలు అప్పగించింది జగన్ ప్రభుత్వం.