భారీ వర్షంలోనే.. ముగిసిన కిడారి అంత్యక్రియలు

Published : Sep 24, 2018, 03:44 PM ISTUpdated : Sep 24, 2018, 04:38 PM IST
భారీ వర్షంలోనే..  ముగిసిన కిడారి అంత్యక్రియలు

సారాంశం

అయితే.. పాడేరులో భారీ వర్షం కురుస్తుండటంతో కిడారు అంత్యక్రియలకు కొంత సేపు ఆటంకం ఏర్పడింది. దీంతో ఆయన భౌతికకాయాన్ని వాహనంలోనే ఉంచారు. 

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి.  ఆదివారం మావోయిస్టులు చేసిన దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన అంతిమయాత్ర పాడేరులో నిర్వహించారు. 

ముందుగా మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.  అనంతరం అంతిమయాత్ర నిర్వహించారు. అయితే.. పాడేరులో భారీ వర్షం కురుస్తుండటంతో కిడారు అంత్యక్రియలకు కొంత సేపు ఆటంకం ఏర్పడింది. దీంతో ఆయన భౌతికకాయాన్ని వాహనంలోనే ఉంచారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో కిడారు అంత్యక్రియలు నిర్వహించారు. 

 పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మావోయిస్టుల దుశ్చర్యను ఖండిస్తూ నినాదాలు చేశారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!
AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...