నయా స్టైల్లో...సిక్స్ ప్యాక్ బాడీ కాదది లిక్కర్ బాడీ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 01, 2020, 11:39 AM ISTUpdated : Sep 01, 2020, 11:48 AM IST
నయా స్టైల్లో...సిక్స్ ప్యాక్ బాడీ కాదది లిక్కర్ బాడీ (వీడియో)

సారాంశం

పోలీసులను బోల్తా కొట్టించి మరీ దర్జాగా మద్యాన్ని రవాణా చేస్తున్న ఇద్దరు అక్రమార్కులు తాజాగా ఏపీ పోలీసులకు చిక్కారు. 

విసన్నపేట: ఆంధ్ర ప్రదేశ్ మద్యం ధరలు అమాంతం పెరిగినప్పటి నుండి తెలంగాణ నుండి అక్రమంగా మద్యం రవాణా అవుతోంది. అయితే ఇలా సాగుతున్న అక్రమ మద్యం రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అక్రమార్కులను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. అయితే పోలీసులను బోల్తా కొట్టించి మరీ దర్జాగా మద్యాన్ని రవాణా చేస్తున్న ఇద్దరు అక్రమార్కులు తాజాగా ఏపీ పోలీసులకు చిక్కారు. 

తెలంగాణలోని అశ్వారావు పేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు శరీరానికి  మద్యం సీసాలను ప్లాస్టర్ తో అతికించుకుని పైన చొక్కాలు తొడిగి దర్జాగా బార్డర్ దాటిస్తున్నారు. అయితే వీరు ఇలా ద్విచక్ర వాహనంపై మద్యాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన విసన్నపేట ఎక్సైజ్ పోలీసులు పోలవరం సమీపంలోని మంకొల్లు వెళుతుండగా పట్టుకున్నారు. 

వీడియో

"

అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ మధుబాబు ఆద్వర్యంలో తనిఖీలు నిర్వహించగా వారి బాగోతం బయటపడింది. ప్రతి రోజు ఇదే తంతుమాదిరిగా ఒక ఉద్యోగంలా చేస్తున్న ఇద్దరు యువకుల ఆట కట్టించిన అధికారులు.వారి వద్ద నుండి 101 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిని అరెస్ట్ చేసి బైక్ సీజ్ చేసినట్లు  సిఐ శ్రీనివాస బాలాజీ తెలిపారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్న చందంగా మారింది ఈ మధ్యం అక్రమ రవాణా. 

PREV
click me!

Recommended Stories

Ambati on Sankranthi Song: నేను సంక్రాంతికి గుర్తురావడానికి కారణం Pawan Kalyan | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?