సీఎం జగన్ వద్ద బలమైన మిషైల్స్ ఉన్నాయి: సినీనటుడు సంచలన వ్యాఖ్యలు

Published : Oct 13, 2019, 04:56 PM IST
సీఎం జగన్ వద్ద బలమైన మిషైల్స్ ఉన్నాయి: సినీనటుడు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వైయస్ జగన్ వద్ద బలమైన మిషైల్స్ ఉన్నాయని అలాంటి బలమైన మిషైల్స్ లో తాను ఒకడినని చెప్పుకొచ్చారు. పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్ అని, రాజకీయం తన నరనరాన జీర్ణించుకు పోయిందన్నారు పృథ్వీరాజ్. 

అమెరికా: దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్. వైయస్ రాజశేఖర్ రెడ్డికి తాను హార్డ్ కోర్ ఫాన్ అని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఓ ప్రముఖ చానెల్ తో ముచ్చటించారు. 

వైయస్ఆర్ కు హార్డ్ కోర్ ఫాన్ అయితే సీఎం వైయస్ జగన్ కు హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ని అంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ అన్నా వైయస్ జగన్ అన్నా పిచ్చి అంటూ చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ వద్ద బలమైన మిషైల్స్ ఉన్నాయని అలాంటి బలమైన మిషైల్స్ లో తాను ఒకడినని చెప్పుకొచ్చారు. పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్ అని, రాజకీయం తన నరనరాన జీర్ణించుకు పోయిందన్నారు పృథ్వీరాజ్. 
 
రాజకీయాల్లో ప్రశ్నించడం అవసరమని ప్రశ్నించాలని చెప్పుకొచ్చారు. వాళ్లని ప్రశ్నిస్తే ఏమనుకుంటారోనని అలా ఆందోళన పడొద్దన్నారు. ఛాన్స్ లు రావేమోనని అనుకుని భయపడుతూ దాక్కుంటే ప్రశ్నించలేమన్నారు. ఒక్కసారి స్టెప్ వేస్తే అదేంటో తెలుస్తుందన్నారు. గట్టిగా మాట్లాడితే నువ్వంటే ఏంటో ప్రజలు అప్పుడు గుర్తిస్తారన్నారు. 

ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్స్ ను చూశామన్నారు. డబుల్ గేమ్ లు ఆడే రాజకీయనాయకులను కూడా చూశామన్నారు. అలాంటి వాళ్లకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని స్పష్టం చేశారు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్.  

ఈ వార్తలు కూడా చదవండి

శ్రీహరి బతికి ఉంటే "జగన్" విషయంలో ఇలా జరిగేదికాదు: సినీపరిశ్రమపై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: జనసేన సభ్యుడు కుటుంబాన్నిపరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ | Asianet Telugu