వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ గ్రామాల్లో అడగుపెట్టలేదు, అండగా ఉన్నాం: ఆది

First Published Jun 6, 2018, 12:53 PM IST
Highlights

వైసీపీపై మంత్రి ఆది హట్ కామెంట్స్


కడప: 2014 ఎన్నికల్లో  తాను వైసీపీ వల్ల విజయం సాధించలేదని ఏపీ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. అభివృద్ది విషయంలో  ఎవరితోనైనా తాను ఆర్డీఓ కార్యాలయం వద్ద కానీ, గాంధీ సెంటర్ వద్ద కానీ చర్చకు సిద్దమేనని మంత్రి ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు.


దేవగుడి కుటుంబాన్ని కొత్తగా వచ్చిన భిక్షగాళ్లు ఎవరైనా రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి .ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు.  తమ పల్లెల్లో ఏజెంట్లుగా కూడా
కూర్చోబెట్టలేని వారు వచ్చి తమ గ్రామాలను సందర్శించి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేవగుడి చుట్టూ ఉన్న పది గ్రామాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా  ఏకపక్షమేనన్నారు.
 
వచ్చే అన్ని ఎన్నికల్లో వారు ఏజెంట్లు కూడా కూర్చోబెట్టుకోలేరని చెప్పారు. చిన్న చిన్న స్థాయి వారిని రెచ్చగొట్టి వారే గొడవకు దిగుతున్నారన్నారు. ఆదివారం జరిగిన పెద్దదండ్లూరు గొడవలో  తమ కుటుంబంపై అనవసరంగా ఆరోపణలు చేసి గొడవను తమ కుటుంబంపై రుద్దుతున్నారన్నారు.


 పులివెందులలో కూడా ఏనాడూ ఏకపక్షంగా ఎన్నికలు జరగలేదన్నారు. తాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వల్ల గెలవలేదని చెప్పారు. 1996లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెద్దముడియం మండలంలో  చిన్నముడియం, ముద్దనూరు మండలంలోని పెనికలపాడులో అడుగు పెట్టలేకపోతే తాము వచ్చినట్టు ఆయన గుర్తు చేశారు.అభివృద్ధి విషయంలో ఏ నాయకుడైనా సరే ఆర్డీవో కార్యాలయం కానీ, గాంధీ సెంటర్‌ కానీ, వారి సొంత గ్రామాల్లో అయినా  చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. 
 

click me!