రాజకీయాల నుండి తప్పుకుంటున్నా: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలనం

Published : Dec 27, 2023, 04:40 PM IST
రాజకీయాల నుండి తప్పుకుంటున్నా: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలనం

సారాంశం

గిద్దలూరు ఎమ్మెల్యే  అన్నా రాంబాబు  బుధవారం నాడు  సంచలన ప్రకటన చేశారు.  వచ్చే ఎన్నికల్లో  మాగుంట కుటుంబాన్ని ఆదరించవద్దని ఆయన కోరారు.

 

ఒంగోలు: రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టుగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బుధవారంనాడు ప్రకటించారు.  

ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకే తప్పకుంటున్నట్టుగా ఎమ్మెల్యే రాంబాబు తేల్చి చెప్పారు.  అనారోగ్య కారణాలతో రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని ఆయన తెలిపారు. పార్టీలో ముఖ్య సామాజిక వర్గం తనను లక్ష్యంగా చేసుకుందని అన్నా రాంబాబు ఆరోపించారు.ఆ సామాజిక వర్గం నన్ను చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పారు.ఈ విషయమై పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దని అన్నా రాంబాబు కోరారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తానని అన్నా రాంబాబు స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu