బైక్ పై వెంబడించి మరీ.. భార్యపై పెట్రోల్ పోసి..

Published : Oct 23, 2018, 03:47 PM IST
బైక్ పై వెంబడించి మరీ.. భార్యపై పెట్రోల్ పోసి..

సారాంశం

కుటుంబ కలహాల నేపథ్యంలో.. పుట్టింటికి వెళ్తున్న భార్యను బైక్ పై వెంబడించి మరీ.. పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

కుటుంబ కలహాల నేపథ్యంలో.. పుట్టింటికి వెళ్తున్న భార్యను బైక్ పై వెంబడించి మరీ.. పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి  వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా బెల్లంకొండకు చెందిన మస్తాన్‌బీకి నరసరావుపేటకు చెందిన మహమ్మద్‌ ఇలియాస్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. 

తరచూ కుటుంబ కలహాలు జరుగుతుండగా భార్యాభర్తలకు బెల్లంకొండ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరలా కుటుంబ కలహాలు నెలకొనడంతో మస్తాన్‌బీ తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఇరు కుటుంబ సభ్యులూ ఆదివారం వారితో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో మస్తాన్‌బీని తీసుకుని ఆమె తండ్రి గఫార్‌ నరసరావుపేట నుంచి జీపులో బెల్లంకొండకు బయలు దేరాడు. 

దీంతో అల్లుడు ఇలియాస్‌ తన బంధువులైన మరో ఐదుగురితో కలసి ద్విచక్ర వాహనాలపై వెంబడించి మాదల చప్టా వద్ద జీపును నిలిపివేసి మాట్లాడుకుందామంటూ వారిని కిందికి దింపారు. తర్వాత మస్తాన్‌బీపై పెట్రోలు చల్లి నిప్పంటించారు. గమనించిన స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్