భార్యను సినిమాకు తీసుకెళ్లాడు.. మధ్యలో బైటికి వచ్చి, బ్యాగు సర్దుకుని...

By SumaBala Bukka  |  First Published May 9, 2022, 11:08 AM IST

గుంటూరు జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. భార్యను సినిమా థియేటర్ కు తీసుకువెళ్లిన ఓ వ్యక్తి మధ్యలోనే బైటికి వచ్చి కనిపించకుండా పోయాడు. 


గుంటూరు జిల్లా : ఏం జరిగిందో ఏమో తెలియదు.. కానీ గుంటూరులో ఓ భర్త అదృశ్యం అయ్యాడు. సినిమాకు తీసుకెళ్లిన భర్త కనిపించకపోవడంతో ఆ భార్యకు ఏం చేయాలో తోచలేదు. దీంతో భర్త missingపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని భార్గవపేటకు చెందిన పడవల బాల సుబ్రహ్మణ్యం శనివారం భార్య బేబి అఖిలతో కలిసి విజయవాడ cinemaకు వెళ్లాడు. సినిమా మధ్యలో బయటకు వచ్చిన సుబ్రహ్మణ్యం నేరుగా మంగళగిరిలోని తన ఇంటికి చేరకుని బ్యాగు సర్దుకుని ఎటో వెళ్లిపోయాడు. సినిమా హాలులో ఉన్న భార్య బేబి అఖిల ఎంతసేపటికీ భర్త hallలోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి చేరుకుని చూడగా, అప్పటికే భర్త bag సర్దుకుని వెళ్లిపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 14న మంగళగిరిలో ఓ వివాహిత అదృశ్యం అయ్యింది. భర్త ఇంట్లోలేని సమయంలో వివాహిత అదృశ్యమైన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. వివాహిత ఆఛూకీ కోసం కుటుంబసభ్యులతో పాటు పోలీసులు కూడా గాలించినప్పటికి ఆచూకీ లభించలేదు. 

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో భార్యాభర్తలు నివాసముండేవారు. భర్త ఉద్యోగం చేస్తుండగా భార్య ఇంటివద్దే వుండేది. అయితే ప్రతిరోజూ మాదిరిగానే ఆ రోజు కూడా భర్త ఆఫీస్ కు వెళ్లగా ఇంట్లో వివాహిత ఒంటరిగా వుంది. ఏమయ్యిందో తెలీదుగానీ భర్త డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఇంటికివచ్చేసరికి భార్య కనిపించలేదు. ఇంటిచుట్టుపక్కల వెతికినా లాభంలేకపోవడంతో కంగారుపడిపోయిన అతడు కుటుంబసభ్యులకు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఎక్కడా ఆమె ఆఛూకీ లభించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 

Latest Videos

కేసు నమోదు చేసుకున్న మంగళగిరి పోలీసులు కూడా వివాహిత ఆఛూకీ కోసం గాలిస్తున్నారు. ఆమెను ఎవరైనా బలవంతంగా ఎత్తుకుపోయారా లేక ఆమే ఇష్టపూర్వకంగా ఎక్కడికైనా వెళ్లిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాలు, ఫోన్ ట్రాకింగ్ ద్వారా యువతి ఆఛూకీ కనుగొనెందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలావుంటే తెలంగాణలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కిష్టయ్యగూడెంకు చెందిన ఆంజనేయులు, నందిని భార్యాభర్తలు. వీరికి ఓ బాబు సంతానం. ఇద్దరు భార్యాభర్తలు పట్టణ పరిధిలోని భవాని నగర్ లో నివాసం ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏమయ్యిందో తెలీదు గాానీ కన్నబిడ్డను ఒంటరిగా వదిలి తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది.

గత నెల(మార్చి)లో ఆంజనేయులు పని నిమిత్తం హైదరాబాద్ కి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఏడాదిన్నర బాబు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. నందిని ఇంట్లో కనిపించలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, బంధువులు, తెలిసినవారిని విచారించి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆమో ఆఛూకీ లభించలేదు. 

click me!