ఎన్టీఆర్ జిల్లాలో కంచలలో దారుణం: భార్యను హత్య చేసిన భర్త

Published : Sep 25, 2023, 10:17 PM IST
ఎన్టీఆర్ జిల్లాలో  కంచలలో దారుణం: భార్యను హత్య చేసిన భర్త

సారాంశం

ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం కంచల గ్రామంలో  భార్యను హత్య చేశాడు భర్త.

విజయవాడ: ఎన్టీఆర్  జిల్లాలోని నందిగామ మండలం కంచల గ్రామంలో  కుటుంబ కలహాలతో  సోమవారంనాడు భార్యను చంపాడు భర్త. తనకు డబ్బులు ఇవ్వలేదని  కస్తాల మరియవాణిని భర్త చిన్నారి హత్య చేశాడు. అదే గ్రామంలో  మరియవాణి  అంగన్ వాడీ ఆయాగా పనిచేస్తున్నారు.  భర్త దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మరియవాణిని ఆసుపత్రికి తరలించారు బంధువులు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మరియవాణి మృతి చెందింది.

ఈ విషయమై  బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు  ఈ ఘటనపై విచారణను ప్రారంభించారు. మరో వైపు భార్యను చంపిన భర్త చిన్నారి  పోలీసులకు లొంగిపోయాడు. అయితే భార్యను  డబ్బుల కోసమే చంపాడా ఇంకా ఇతర కారణాలున్నాయా అనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో  బాధితురాలు చికిత్స పొందే సమయంలో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే