వివాహేతర సంబంధం: భార్యను చంపి తగులబెట్టిన భర్త

Published : Mar 04, 2021, 10:20 AM ISTUpdated : Mar 04, 2021, 10:23 AM IST
వివాహేతర సంబంధం: భార్యను చంపి తగులబెట్టిన భర్త

సారాంశం

పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను  కుటుంబసభ్యులతో కలిసి భర్త హత్య చేశాడు.  ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఘటనకు సంబందించిన వివరాలను పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు.

హైదరాబాద్: పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను  కుటుంబసభ్యులతో కలిసి భర్త హత్య చేశాడు.  ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఘటనకు సంబందించిన వివరాలను పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు.

లోవ దేవాలయంలో సన్నాయి వాయిద్యకారుడు చింతపల్లి సత్యనారాయణకు 2004లో తన అక్క కూతురు ఆదిలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద కొడుకు టెన్త్ క్లాస్. చిన్న కొడుకు నాలుగో తరగతి చదువుతున్నాడు.  వీరు తుని మార్కండ్రాజుపేటలో నివాసం ఉంటున్నారు.

ఆదిలక్ష్మి కొంతకాలంగా కొందరితో వివాహేతర సంబంధం కలిగి ఉంటుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఆమెను మందలించాడు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 

దీంతో భార్యను హత్య చేయాలని సత్యనారాయణ భావించాడు. ఫిబ్రవరి 28న  ఆదిలక్ష్మిని తలపై సుత్తితో కొట్టి చంపారు. దీంతో ఆమె మరణించింది. మృతదేహాన్ని  గోనెసంచిలో కట్టి స్కూటీపై కొత్తవెలంపేట శివారు మామిడితోటకు తరలించారు.  పెట్రోల్ పోసి మృతదేహాన్ని దగ్దం చేశారు. అయితే ఆ మృతదేహం సగం మాత్రమే కాలింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.

సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా ఆధారాలను సేకరించారు. ఈ దర్యాప్తు సాగుతున్న విషయాన్ని గుర్తించిన సత్యనారాయణ ఆయన కుుటుంబసభ్యులు బుధవారం నాడు పోలీసులకు లొంగిపోయారు. వీరిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు | Asianet News Telugu
Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu