అనుమానం.. పెనుభూతం: భార్యను దారుణంగా చంపిన భర్త

Siva Kodati |  
Published : May 26, 2019, 10:01 AM IST
అనుమానం.. పెనుభూతం: భార్యను దారుణంగా చంపిన భర్త

సారాంశం

చిత్తూరులో దారుణం జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కక్షతో ఆమెను భర్త దారుణంగా హత్య చేశాడు.

చిత్తూరులో దారుణం జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కక్షతో ఆమెను భర్త దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే... వి. కోట మండలం దాసార్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, వసంతకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు..

అతను ట్రాక్టర్ డ్రైవర్‌గా.. భార్య తాపీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలో కూలి పనులకు వెళ్తున్న భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని శ్రీనివాసులు అనుమానించేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. మాట మాట పెరిగి.. అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాసులు భార్య తలపై గడ్డపారతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అ

నంతరం నిందితుడు ఆదివారం ఉదయం వి.కోట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీయగా.. తన భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అందుకే హతమార్చానని చెప్పాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల్లి మరణించడం, తండ్రి జైలుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్