పిల్లలు పుట్టడం లేదని భార్యను..

Published : Feb 11, 2019, 04:46 PM IST
పిల్లలు పుట్టడం లేదని భార్యను..

సారాంశం

భార్యకు పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను చీకటి గదిలో ఎవరికీ తెలియకుండా కట్టేశాడు. 

భార్యకు పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను చీకటి గదిలో ఎవరికీ తెలియకుండా కట్టేశాడు. ఈ దారుణ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కడప జిల్లాకు చెందిన గౌసియా అనే మహిళకు 20 సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కాగా.. పెళ్లై 20 ఏళ్లు గడుస్తున్నా.. వారికి పిల్లలు కలగలేదు.  దీంతో.. గౌసియా భర్త ఇటీవల వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. తనకు గతంలో పెళ్లి అయ్యి.. భార్య ఉందనే విషయాన్ని దాచి రెండో పెళ్లి చేసుకున్నాడు.

అయితే.. ఈ విషయం బయట పడితే.. తన రెండో భార్య తనని వదిలేసి వెళ్లిపోతుందని భావించాడు. అందుకే.. మొదటి భార్యను  ఎవరికీ తెలియకుండా బూత్ బంగ్లా లాంటి ఇంట్లో చీకటి గదిలో బంధించాడు. గత కొద్ది రోజులుగా ఆమె ఆ చీకటి గదిలోనే మగ్గిపోయింది. కాగా.. ఈ విషయాన్ని గ్రహించిన గౌసియా కుటుంబసభ్యులు ఆమెను ఆ బంధీ నుంచి విడిపించారు. ఆమె భర్తపై మానవ హక్కుల  కమిషన్ కి ఫిర్యాదు చేశారు.

నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna