
తిరుపతి జిల్లాలోని పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శరవేగంగా వెళ్తోన్న ఓ కారు.. ప్రమాదవశాత్తు లారీ కంటైనర్ కిందకు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.