బైక్ మీద వెడుతున్న దంపతుల మీద హిజ్రాల దాడి...

Published : Mar 17, 2022, 11:29 AM ISTUpdated : Mar 17, 2022, 11:30 AM IST
బైక్ మీద వెడుతున్న దంపతుల మీద హిజ్రాల దాడి...

సారాంశం

హిజ్రాలు మరీ దారుణానికి తెగించారు. బైక్ మీద వెడుతున్న దంపతుల మీద దాడి చేశారు. డబ్బులు అడిగితే ఇవ్వలేదని వారిమీద దాడి చేశారు. ఈ దాడిలో భార్య మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు మాయమయ్యింది. 

బొమ్మల సత్రం : బైక్ మీద వెడుతున్న దంపతుల మీద Hijraలు దాడి చేశారు. నంద్యాల పట్టణ శివారులో ఈ ఘటన జరిగింది. బాధితులు తెలిపి వివరాల మేరకు.. holi festival ఉండటంతో పాణ్యం మండలం రాంభూపాల్ రెడ్డి తండాకు చెందిన బాలనాయక్, హనీమాబాయి దంపతులు నిత్యావసరం సరుకుల కోసం నంద్యాల పట్టణానికి bike మీద బయలుదేరారు. ఆటో నగర్ శివారులోని హనీ, ఆశ అనే హిజ్రాలు వారి బైక్ మీద అడ్డగించి డబ్బు అడిగారు. తన వద్ద చిల్లర డబ్బులు లేవనడంతో వారు బలవంతంగా బాలనాయక్ జేబులో చేతులు పెట్టి రూ. 100 నోటు లాక్కునే ప్రయత్నం చేశారు. 

ఇవ్వకపోవడంతో బైక్ పై ఉన్న ఆ దంపతులను కిందకు తోసి వారి మీద దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో బాలనాయక్ భార్య మెడలో ఉన్న రెండు తులాల బంగారు తాళిబొట్టు గొలుసు మాయం కావడంతో వారు రూరల్ సీఐ మురళీమోహన్ రావును కలిసి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన హిజ్రాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

ఇదిలా ఉండగా, నవంబర్ 20, 2021నాడు ఇలాంటి ఘటనే జరిగింది. చంటిబిడ్డను తల్లి దగ్గర్నుంచి లాక్కున్న ఓ Hijra.. డబ్బులిస్తేనే విడిచిపెడతానని డిమాండ్ చేసింది. చివరకు, హిజ్రా ఒడిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బెంగాల్ లోని మాల్దా జిల్లాలో ఈ విషాదం జరిగింది. బంగ్లా గ్రామంలో నివసించే మంపి సర్కార్ దంపతులకు అక్టోబర్ 29న ముగ్గురు Children పుట్టారు. గత బుదవారం (నవంబర్ 17న) మధ్యాహ్నం కొంతమంది హిజ్రాలు సర్కార్ ఇంటికి వెళ్లారు. 

పిల్లలకు Blessingలు అందిస్తామంటూ రూ.5వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేమనడంతో కుటుంబసభ్యులతో వాదనకు దిగారు. అంతలోనే ఔలద్ అలీ అనే హిజ్రా.. ఓ శిశువును తన ఒడిలోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. తమ వద్ద ఉన్న రూ. 500 ఇస్తానన్నా వినిపించుకోలేదు. శిశువుకు నలతగా ఉందని, పాలు పట్టాలని చెప్పినా వినిపించుకోలేదు. చివరికి హిజ్రా చేతిలోనే బిడ్డ ప్రాణం విడిచిందని తల్లి బోరుమంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అలీని అరెస్ట్ చేశారు. 

ఇక ఆగస్ట్ 17న ఇలాంటి ఘటనే జరిగింది. ఏ శుభకార్యం అయినా హిజ్రాలు వాలిపోతారు. ఈనాం పేరుతో సతాయించడం అందరికీ అనుభవమైన విషయమే. కొన్నిసార్లు ఈ వేధింపులు ఎక్కువై గొడవలకు దారి తీయడమూ తెలిసిందే. అలాంటి  ఓ దారుణ ఘటనే గుంటూరులోని వెంకటాద్రి పేటలో చోటు చేసుకుంది. చందన అనే హిజ్రా హత్యకు గురైంది. చందన తన వెంటపడి వేధిస్తుండడంతో అదే ప్రాంతానికి చెందిన యువకుడు ఆగ్రహానికి లోనయ్యాడు. రోకటిబండతో హిజ్రాను తలమద గట్టిగా కొట్టాడు. తలమీద బలమైన గాయం కావడంతో చందన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu