గంజాయి కేసులో కటారి అనుచరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అడ్డుకున్న మాజీ మేయర్, చిత్తూరులో హైటెన్షన్

By Siva KodatiFirst Published Jun 24, 2022, 7:24 PM IST
Highlights

చిత్తూరులో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గంజాయి కేసులో కటారి వర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో మాజీ మేయర్, టీడీపీ నేత కటారి హేమలత అడ్డుకున్నారు.

చిత్తూరులో (chittoor) హై టెన్షన్ నెలకొంది. గంజాయి కేసు పేరుతో కటారి వర్గీయుడిని తీసుకెళ్తుండగా.. అనుచరులతో కలిసి మాజీ మేయర్ హేమలత (katari hemalatha) పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ జీపు తగిలి ఆమె కారుకు గాయమైంది. అయితే అధికార పార్టీ నేతల పోలీసులు చెప్పడం వల్లే ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు (tdp) ఆరోపిస్తున్నారు. దీంతో మరోసారి కటారి అనూరాధ దంపతుల (katari anuradha) హత్య కేసు తెరపైకి వచ్చింది. తన అత్తమామలు దివంగత మేయర్ కటారి అనూరాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ అనుచరులు సాక్షుల్ని బెదిరిస్తున్నారని గురువారం సాయంత్రం మూడున్నర గంటలకు హేమలత మీడియాకు తెలిపారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కొందరి పేర్లను ఆమె ప్రస్తావించారు. అయితే అలా చెప్పిన కొన్ని గంటల్లోనే పోలీసులు గంజాయి కేసు పేరిట రంగంలోకి దిగడంతో రాజకీయ రగడకు తెర లేచింది. 

click me!