చెత్త సేకరణ వ్యాన్ కిందపడి కార్మికుడు మృతి.. కార్మిక సంఘాల ఆందోళన, విజయవాడలో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Dec 31, 2022, 04:16 PM IST
చెత్త సేకరణ వ్యాన్ కిందపడి కార్మికుడు మృతి.. కార్మిక సంఘాల ఆందోళన, విజయవాడలో ఉద్రిక్తత

సారాంశం

చెత్త సేకరణ వ్యాన్ కింద పడి రాజేష్ అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోవడంతో విజయవాడలో ఉద్రికత్తకు దారితీసింది. రాజేశ్ కుటుంబానికి రూ.25 లక్షలతో పాటు సొంతిల్లు ఇవ్వాలని కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి.

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెత్త సేకరణ వ్యాన్ కింద పడి రాజేష్ అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. రాజేశ్ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నాయి కార్మిక సంఘాలు. రాజేశ్ కుటుంబానికి రూ.25 లక్షలతో పాటు సొంతిల్లు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. భారీ బందోబస్త్ మద్య రాజేశ్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే 200 మంది పోలీసుల భద్రత మధ్య అతని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఉద్రిక్తతలకు కారణమైన 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu
CM Chandrababu Speech: ఏపీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu