
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎర్రమాడు పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రెండు సార్లు కౌంటింగ్ నిర్వహించడం ఫలితం తారుమారు కావడంతో టీడీపీ ఆందోళన చేపట్టింది. మొదట ప్రకటించిన ఫలితాల్లో ఒక ఓటు తేడాతో తమ అభ్యర్ధి గెలిచాడని టీడీపీ నేతలు చెప్పారు. కానీ.. వైసీపీ అభ్యర్ధి మాత్రం రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. రెండు సార్లు రీకౌంటింగ్ నిర్వహించిన అధికారులు వైసీపీ అభ్యర్ధి గెలిచినట్లుగా ప్రకటించారు. అధికారులు ఫలితాలను తారుమారు చేశారంటూ తెలుగుదేశం నేతలు గొడవకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.