సోషల్ మీడియాలో వ్యభిచార దందా... ఈజీ మనీ కోసం కాలేజీ యువతులు

By telugu news teamFirst Published Mar 18, 2020, 12:07 PM IST
Highlights

ముందుగా.. వారికి మెసేజ్ లు చేస్తారు. వారి అవసరాలేంటో.. మెల్లగా ఛాటింగ్ ద్వారా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగం ఇప్పిస్తామని.. కావాల్సినంత డబ్బు ఇస్తామంటూ ఆశపెడతారు. వారి బుట్టలో అమ్మాయిలు పడ్డారా ఇక అంతే.

అవసరం ఎలాంటి వారితోనైనా తప్పు చేయిస్తుంది అనే నానుడి ఉంది. అలాంటి వారి అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని.. డబ్బు ఇస్తామంటూ ఆశచూపించి.. కాలేజీ యువతులను వ్యభిచార దందాలోకి దింపుతుతున్నారు. బయట ఎవరూ గుర్తించకుండా స్మార్ట్ ఫోన్లలోనే  మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

Also Read ఏపీలో కలకలం... ఏలూరులో మరో కరోనా అనుమానిత కేసు...

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు చేతిలో లేనివారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అలాంటి వారికే ఈ వ్యభిచార ముఠా గాలం వేస్తుంది. ముందుగా.. వారికి మెసేజ్ లు చేస్తారు. వారి అవసరాలేంటో.. మెల్లగా ఛాటింగ్ ద్వారా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగం ఇప్పిస్తామని.. కావాల్సినంత డబ్బు ఇస్తామంటూ ఆశపెడతారు. వారి బుట్టలో అమ్మాయిలు పడ్డారా ఇక అంతే.

ముందుగా స్థానికంగా ఉన్న అమ్మాయిలు, మహిళలను ఇళ్లకు పిలిపించుకోవడం.. వారికి అండగా ఉంటామంటూ నమ్మకాన్ని కల్పిస్తున్నారు. మెల్లమెల్లగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు మళ్లీ బయటకు రావడం కష్టమే. 
 
వ్యభిచార కూపంలోకి దించిన యువతులను డేటింగ్‌ యాప్‌లోకి అడ్మిట్‌ చేయిస్తారు. డేటింగ్‌ యాప్స్‌లో ముఖ్యమైన ఇన్‌స్ట్ర్రాగం, ఊ ది డేటింగ్‌ యాప్‌( రెడీ టూ మీట్‌ న్యూగర్ల్స్‌ ఫ్రం యువర్‌ ఏరియా), జస్ట్‌ ఫ్రెండ్స్, క్వాక్‌ క్వాక్, వీ మేట్, జిల్, స్నాప్‌చాట్, విగో, టిండర్, క్రస్‌లాంటి వాటిలోకి వెళితే వందలు కాదు వేలాదిమంది స్నేహితులుగా మారుతారు. ఇందులో నియర్‌ బై అనే ఆప్షన్‌ ద్వారా ఈ ప్రాంతంలోకి వారిని సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా లైవ్‌ కాల్స్‌ నుంచి డైరెక్ట్‌గా మీటింగులు జరుగుతుంటాయి. 

కాగా.. వీరి మాయలో ఎక్కువగా కాలేజీ యువతులు, ఒంటరి మహిళలే పడుతుండటం గమనార్హం. అద్దెకు ఇళ్లు తీసుకోవడం లేదా లాడ్జిలలో వీరు గుట్టుగా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ దందా పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం. 

click me!