అమరావతే రాజధాని అని తీర్పు ఇచ్చాక.. ఇంకా ఇలా చేయడమేంటి??.. హైకోర్టు సీరియస్...

Published : Nov 03, 2022, 09:29 AM IST
అమరావతే రాజధాని అని తీర్పు ఇచ్చాక.. ఇంకా ఇలా చేయడమేంటి??.. హైకోర్టు సీరియస్...

సారాంశం

అమరావతే రాజధాని అని హైకోర్టు చెప్పిన తరువాత కూడా మూడు రాజధానులన గురించి కార్యక్రమాలు చేపట్టడం మీద హై కోర్టు సీరియస్ అయ్యింది. 

అమరావతి :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తాము స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఇలాంటి చర్యలు అభినందించదగినవి కావు అని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి అధికారం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించడం సరికాదు అంది. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తుందని ప్రశ్నించింది. 

రాజధాని అమరావతి అని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చాక.. అదే అంశంపై రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించింది. ఇలాంటివన్నీ రైతులను ముందుంచి  నిర్వహించే రాజకీయ పాదయాత్ర అని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో ఎస్ఎల్ పీలు దాఖలు అయ్యాయని గుర్తు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూడాలని చెప్పుకొచ్చింది. రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు బిజీగా ఉందని, ఇలాంటి చర్యలు న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే అని భావిస్తున్నామంది. 

‘గడప గడపకు..’ కార్యక్రమంలో బూతులతో రెచ్చిపోయి వ్యక్తిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి..

పాదయాత్ర వ్యవహారమై అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన షరతులతో  తమకు సంఘీభావం తెలియజేసే హక్కు లేకుండా పోతోందని పేర్కొంటూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య’, ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’  కార్యదర్శి ధనేకుల రామారావు అక్టోబర్ 27న అప్పీళ్లను దాఖలు చేశారు. వీటిపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా  ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై థర్డ్ పార్టీ అయిన మీరు ఎలా అప్పీలు వేస్తారు?  అన్ని ప్రాథమిక  అభ్యంతరం లేవనెత్తింది. 

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కోర్టు ఫైల్ లోకి చేరకపోవడంతో విచారణను ఈ నెల ఏడiకి వాయిదా వేసింది. కౌంటర్ దస్త్రాన్ని రికార్డుల్లో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

600 మందితో మందితో మాత్రమే యాత్ర చేయాలని హైకోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుందని సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు అన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయంతో రాజధానికి భూములిచ్చిన రైతులకు కలిగే ఇబ్బందులను ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేస్తున్నారు. ఆరు వందల మందితో మాత్రమే యాత్ర నిర్వహించాలని, సంఘీభావం రహదారుల పక్కన నిలబడి తెలపాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు అప్పీలు దాఖలు చేసిన ప్రభుత్వ సంఘ సభ్యులకు విఘాతంగా మారాయి. వారి హక్కులను హరిస్తున్నాయి. 

పాదయాత్ర ఆరు వందల మందితో మాత్రమే నిర్వహించాలని న్యాయస్థానం ఏవిధంగా నిర్ణయిస్తుంది?  పాదయాత్రలో కలిసి నడిచేందుకు పిటిషనర్ల సంఘ సభ్యులకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం..’ అని రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజధాని అమరావతే అని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చాక పాదయాత్ర ఎందుకు అని ప్రశ్నించింది.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu