డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి షాక్... హైకోర్టు నోటీసులు

By telugu teamFirst Published Nov 21, 2019, 7:38 AM IST
Highlights

చెల్లుబాటు కాని కుల ధ్రు వీకరణ పత్రంతో ఎస్టీ నియోజకవర్గం కురుపాం నుంచి పోటీచేసి గెలిచిన ప్రస్తుత డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. 
 

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి ఊహించని షాక్ తగిలింది. ఆమె అసలు ఎస్సీ కులానికి చెందిన వారు కాదని... కానీ నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారంటూ ఆమెపై ప్రతిపక్ష పార్టీ నేతలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో చెల్లుబాటు కాని కుల ధ్రు వీకరణ పత్రంతో ఎస్టీ నియోజకవర్గం కురుపాం నుంచి పోటీచేసి గెలిచిన ప్రస్తుత డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. 

దీనిపై మంత్రి శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సోమ యాజులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా కురు పాం(ఎస్టీ) నియోజకవర్గంలో పుష్పశ్రీవాణి ఎన్నికను సవాల్‌ చేస్తూ ఆమె ప్రత్యర్థులుగా పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.సింహాచలం, బీజేపీ అభ్యర్థి ఎన్‌.జయరాజు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

పుష్పశ్రీవాణి కొండదొరగా పేర్కొంటూ ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందారని, కానీ అది చెల్లుబాటు కానిదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని వారు హైకోర్టును అభ్యర్థించారు.
 

click me!