చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

First Published Sep 19, 2017, 1:58 PM IST
Highlights
  • చంద్రబాబునాయుడుకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది.
  • అక్రమ కట్టడాలకు సంబంధించి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసు వేసారు.
  • ఆ కేసును మంగళవారం కోర్టు విచారించింది.
  • విచారణలో భాగంగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోను, నదీ కరకట్ట పైన అక్రమ కట్టడాలు వెలసిన విధానంపై ఆర్కె తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.
  • అక్రమ కట్టడాలు నదికి ఏ విధంగా నష్టం చేస్తాయో చెప్పారు.

చంద్రబాబునాయుడుకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ కట్టడాలకు సంబంధించి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసు వేసారు. ఆ కేసును మంగళవారం కోర్టు విచారించింది. విచారణలో భాగంగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోను, నదీ కరకట్ట పైన అక్రమ కట్టడాలు వెలసిన విధానంపై ఆర్కె తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాలు నదికి ఏ విధంగా నష్టం చేస్తాయో చెప్పారు.

తన వాదనకు మద్దతుగా కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను, గతంలో వివిధ కేసుల సందర్భంగా సుప్రింకోర్టు చెప్పిన తీర్పులు తదితరాలతో పాటు పర్యావరణ వేత్తల ఆందోళనలను కూడా న్యాయవాది కోర్టు ముందుంచారు. న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి వెంటనే మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. అందులో భాగంగా చంద్రబాబుతో పాటు మరో 57 మందికి నోటీసులివ్వాలని హై కోర్టు ఆదేశించింది.

చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే కృష్ణానది కరకట్టపైన నిర్మించిన కట్టడాలన్నీ అక్రమ కట్టడాలుగా గుర్తించి కూల్చేయాలని నిర్ణయించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్ లో ఉండేవారు. అయితే, ‘‘ఓటుకునోటు’’ కేసు వెలుగు చూసిందో తన మకాంను చంద్రబాబు హటాత్తుగా విజయవాడకు మార్చేసారు. అప్పటికప్పుడు ఓ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల్లో ఒకదాన్ని ఎంచుకున్నారు.

ఎప్పుడైతే స్వయంగా చంద్రబాబే ఓ అక్రమ కట్టడంలో నివాసముండాలని నిర్ణయించుకున్నారో వెంటనే అధికారులు మిగిలిన వాటిని కూడా సక్రమ కట్టడాలుగా మార్చేసారు. దాంతో అప్పటి నుండి కరకట్ట అక్రమ కట్టడాలపై వివాదం నలుగుతూనే ఉంది. చివరకు ఆర్కె కోర్టును ఆశ్రయించటంతో ఈరోజు కోర్టు అందరికీ నోటీసులు జారీ చేయమని ఆదేశించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

click me!