జగన్ ఆస్తుల కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

By Nagaraju penumalaFirst Published Feb 4, 2019, 7:17 PM IST
Highlights

ఇకపోతే ఆదిత్యనాథ్ ను సీబీఐ విచారణకు గతంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. 2004-2009 మధ్య కాలంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ వైఎస్ జగన్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు మోపింది. 

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ ఊరట లభించే ప్రకటన వెల్లడించింది.  

ఆదిత్యనాథ్ పై సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టి వేసింది. ఇకపోతే ఆదిత్యనాథ్ ను సీబీఐ విచారణకు గతంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. 2004-2009 మధ్య కాలంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ వైఎస్ జగన్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు మోపింది. 

ముఖ్యంగా ఇండియా సిమెంట్ కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు జగన్ ఆస్తుల కేసులో ఊరట పొందారు. తాజాగా ఆదిత్యనాథ్ ఆరోపణలను హై కోర్టు కొట్టివేయడంతో ఆయనకు కూడా ఊరట లభించింది.  
 

click me!