ఐపీఎస్ బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం: టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

Published : Apr 19, 2019, 12:36 PM IST
ఐపీఎస్  బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం: టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

సారాంశం

2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు, కొందరు  అధికారులపై దౌర్జన్యానికి పాల్పడినట్టుగా విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై హైకోర్టు నోటీసులు పంపింది.  

విజయవాడ:  2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు, కొందరు  అధికారులపై దౌర్జన్యానికి పాల్పడినట్టుగా విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై హైకోర్టు నోటీసులు పంపింది.

ఓ ట్రావెల్స్ విషయంలో రవాణా శాఖ అధికారులపై  విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు దౌర్జన్యానికి పాల్పడ్డారనే  ఆరోపణలు వచ్చాయి. 

ఈ విషయమై ఆ తర్వాత చంద్రబాబునాయుడు పార్టీ  నేతలపై సీరియస్ అయ్యారు. బాబు ఆదేశాల మేరకు వారంతా సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యానికి క్షమాపణ చెప్పారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఈ నలుగురికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ కమిషనర్‌ ద్వారా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు  విచారణను ఈ ఏడాది జూన్ మాసానికి వాయిదా వేసింది హైకోర్టు.  


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu