కుప్పంలో చంద్రబాబుపై హీరో విశాల్ పోటీ.. క్లారిటీ ఇచ్చిన హీరో...

Published : Dec 19, 2022, 09:31 AM IST
కుప్పంలో చంద్రబాబుపై హీరో విశాల్ పోటీ.. క్లారిటీ ఇచ్చిన హీరో...

సారాంశం

అవన్నీ వదంతులే అంటూ హీరో విశాల్ క్లారిటీ ఇచ్చారు. కుప్పంలో తాను పోటీ చేయబోవడం లేదని తేల్చేశారు. రాజకీయాల్లోకి రావడం మాత్రం ఖాయమన్నారు. 

చెన్నై : సినీ నటుడు, హీరో విశాల్ తెలుగు వాడేనన్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నాడు. అయితే తెలుగు హీరో కావడంతో అతనికి కుప్పంతో అనుబంధం ఉండడంతో.. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. విశాల్ కుప్పంనుంచి పోటీ చేయనున్నారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ వార్తల మీద విశాల్ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కుప్పం నియోజకవర్గంనుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పోటీ చేయనున్నానని వార్తలు వస్తున్న సంగతి తనదాకా వచ్చిందని.. అయితే ఆ వార్తలు వట్టి వదంతులేనని నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

విశాల్ హీరోగా నటించిన ‘లత్తి’ (లాఠీ) సినిమాకు సంబంధించిన చెన్నైలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో విశాల్ మాట్లాడుతూ కుప్పంకు.. అక్కడి ప్రాంత వాసులతో తనకు అనుబంధం ఉన్న సంగతి నిజమేనని.. అయితే తాను అక్కడినుంచి పోటీ చేస్తానన్న వార్తలు నిజం కాదని అన్నారు. అయితే, తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని. సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీకి దిగుతానని చెప్పుకొచ్చారు. కుప్పంలో మా నాన్న గ్రానైట్ వ్యాపారం చేసేవారు. ఆ సమయంలో మూడేళ్లపాటు కుప్పంలో ఉణ్నాను... అని చెప్పుకొచ్చారు. ఇక విలేకరులు ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సమాధానమిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour